తెలుగు న్యూస్ / ఫోటో /
Benefits of Soaked Walnut : వాల్‌నట్స్ నానబెట్టుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- Benefits of Soaked Walnut : వాల్‌నట్స్ ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. బరువు తగ్గడంలో, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఇవి మెరుగైన ఫలితాలను ఇస్తాయి. అంతేనా వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని నేరుగా తినడం కాకుండా నానబెట్టి తింటే.. మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

(1 / 5)
వాల్ నట్ ధర కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ధరకి భయపడి తినడం మానేయవద్దు అంటున్నారు పోషకాహార నిపుణులు. చలికాలంలో వాల్‌నట్‌లను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. వాల్ నట్స్‌ను కేక్‌లు, సలాడ్లు, కుకీలలో కలిపి తీసుకుంటే అవి శరీరాన్ని అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని చెప్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును కాపాడుకోవడానికి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి, మధుమేహాన్ని నియంత్రణకై వాల్‌నట్స్ చాలా మంచిది.
(2 / 5)
అయితే వాల్ నట్స్ నానబెట్టి తింటే అది మరింత సూపర్ ఫుడ్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే నానబెట్టిన వాల్‌నట్‌లు శరీరానికి ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
(3 / 5)
వాల్‌నట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయని, జీర్ణ రుగ్మతలను సరిచేస్తుందని నిపుణులు తెలిపారు. ఈ విధంగా వాల్ నట్స్ తినడం వల్ల పాలీఫినాల్స్ తగ్గుతాయని, వాల్ నట్స్‌లో ఉండే పోషకాలన్నీ ఎక్కువగా లభిస్తాయని అంటున్నారు.
(4 / 5)
ఒక రోజులో 2 నుంచి 4 వాల్ నట్స్ తినవచ్చు. వాల్ నట్స్‌ను నానబెట్టి రాత్రిపూట పాలతో కలిపి తింటే రకరకాల వ్యాధులకు దూరం చేసుకోవచ్చు. 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టిన వాల్‌నట్‌లను తింటే శారీరక సమస్యలు తగ్గుతాయని డైటీషియన్లు చెప్తున్నారు.
ఇతర గ్యాలరీలు