Smita Sabharwal : శక్తివంతమైన ఆయుధంతో ఐఏఎస్‌గా ఎదిగి.. ఆదర్శంగా నిలిచి.. స్మితా సబర్వాల్ సక్సెస్ స్టోరీ
- Smita Sabharwal : ప్రపంచాన్ని మార్చడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. ఈ మాటను బలంగా నమ్ముతారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. సివిల్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. చాలామంది రెండు, మూడుసార్లు ప్రయత్నించినా సాధించలేరు. కానీ.. స్మితా సబర్వాల్ రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు.
- Smita Sabharwal : ప్రపంచాన్ని మార్చడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. ఈ మాటను బలంగా నమ్ముతారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. సివిల్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. చాలామంది రెండు, మూడుసార్లు ప్రయత్నించినా సాధించలేరు. కానీ.. స్మితా సబర్వాల్ రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు.
(1 / 5)
జూన్ 19, 1977న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో బెంగాలీ కుటుంబంలో స్మితా సబర్వాల్ జన్మించారు. స్మితా సబర్వాల్ తండ్రి ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్. తల్లి పురబీ దాస్. వీరి కుటుంబానికి హైదరాబాద్ నగరంతో అనుబంధం ఉంది.(@SmitaSabharwal)
(2 / 5)
స్మితా సబర్వాల్ సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదివారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న క్యాథలిక్ మైనారిటీ సంస్థ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్.(@SmitaSabharwal)
(3 / 5)
23 సంవత్సరాల వయస్సులోనే స్మితా సబర్వాల్ యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. భారతదేశంలోని అతి పిన్న వయస్కులైన మహిళా అధికారుల్లో ఒకరిగా నిలిచారు. స్మితా సబర్వాల్ 2001 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సబర్వాల్ 2000లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు, ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు.(@SmitaSabharwal)
(4 / 5)
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను ప్రజల అధికారి అని పిలుస్తారు. ఆమె వరంగల్, విశాఖపట్నం, కరీంనగర్, చిత్తూరుతో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో పనిచేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమితులైన అతి పిన్న వయస్కురాలు కూడా ఆమె కావడం గమనార్హం. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (@SmitaSabharwal)
ఇతర గ్యాలరీలు