తెలుగు న్యూస్ / ఫోటో /
Rohit Sharma: రోహిత్ శర్మ మరో ‘సిక్స్‌ల’ రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా..
- Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్స్‌ల విషయంలో మరో రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 22) న్యూజిలాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో ఈ రికార్డుకు చేరుకున్నాడు. ఆ వివరాలివే..
- Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్స్‌ల విషయంలో మరో రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 22) న్యూజిలాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో ఈ రికార్డుకు చేరుకున్నాడు. ఆ వివరాలివే..
(1 / 5)
వన్డే ప్రపంచకప్‍లో ఆదివారం (అక్టోబర్ 22) న్యూజిలాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 4 సిక్స్‌లు, 4 ఫోర్లు బాదాడు. లక్ష్యఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో ఓ చరిత్ర సృష్టించాడు. (PTI)
(2 / 5)
ఓ క్యాలెండర్ ఇయర్ (ఒకే సంవత్సరంలో)లో వన్డేల్లో 50 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు సాధించిన తొలి ఏషియన్ ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. (AP)
(3 / 5)
అంతర్జాతీయంగా ఒకే క్యాలెండర్ ఇయర్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ (50) మూడో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ (58 - 2015లో), క్రిస్ గేల్ (56 - 2019లో) హిట్‍మ్యాన్ కంటే ముందున్నారు. ఈ ఏడాది ఇంకా మ్యాచ్‍లు ఉండటంతో వారిని కూడా రోహిత్ దాటే అవకాశం ఉంది. (PTI)
(4 / 5)
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో డెవిలియర్స్ (37)ను రోహిత్ శర్మ (38) దాటేశాడు. రెండో స్థానానికి చేరాడు. క్రిస్ గేల్ (49) మొదటి స్థానంలో ఉన్నాడు.(AFP)
ఇతర గ్యాలరీలు