తెలుగు న్యూస్ / ఫోటో /
Rahul Gandhi: స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ; సేవలో పాల్గొని పాత్రలు శుభ్రం చేసిన కాంగ్రెస్ నేత
Rahul Gandhi visits Golden Temple: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా అమృతసర్ లోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సేవలో పాల్గొన్నారు.
(1 / 8)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం స్వర్ణదేవాలయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆలయంలో భక్తుల సేవలో పాల్గొన్నారు. భక్తులకు నీరు అందించారు. (PTI)
(2 / 8)
స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో సంప్రదాయంగా భక్తులు ధరించే తలకు బ్లూ కలర్ స్కార్ఫ్ ను రాహుల్ గాంధీ కూడా ధరించారు. (PTI)
(3 / 8)
రాహుల్ గాంధీ అకాల్ తఖ్త్ ను సందర్శించారు. సేవలో భాగంగా భక్తులు ఉపయోగించిన పాత్రలను శుభ్రపర్చారు. (PTI)
(4 / 8)
స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో రాహుల్ గాంధీ చాలా సేపు గడిపారు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు తాగు నీరు అందించే సేవలో కూడా రాహుల్ పాల్గొన్నారు. (PTI)
(5 / 8)
రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో పాల్గొన్న సేవలో భాగంగా భక్తులు ఉపయోగించిన పాత్రలను శుభ్రపర్చారు. వారికి తాగు నీరు అందించారు. పలువురు భక్తులు రాహుల్ గాంధీ తో సెల్ఫీలు దిగారు. (PTI)
(6 / 8)
స్వర్ణ దేవాలయంలో సేవలో పాల్గొనడంతో పాటు అంతరాలయంలో పాడే ‘షాబాద్ కీర్తన్’ లను శ్రద్ధగా విన్నారు. (AICC )
ఇతర గ్యాలరీలు