Polavaram Project : పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి, స్పిల్ వే నుంచి ప్రవహిస్తున్న గోదావరి వరద-polavaram project flood water flow through spill way ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Polavaram Project : పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి, స్పిల్ వే నుంచి ప్రవహిస్తున్న గోదావరి వరద

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి, స్పిల్ వే నుంచి ప్రవహిస్తున్న గోదావరి వరద

Jul 10, 2024, 04:59 PM IST Bandaru Satyaprasad
Jul 10, 2024, 04:59 PM , IST

  • Polavaram Project : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంలో పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి పట్టం పెరుగుతోంది. దీంత పోలవరం 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంలో పెరుగుతోంది. పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. 

(1 / 5)

ఎగువ నుంచి వస్తున్న వరదతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి పట్టం పెరుగుతోంది. దీంత పోలవరం 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

(2 / 5)

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఎగువన 26.700 మీటర్లు, స్పిల్‌వే దిగువన 16.720 మీటర్లు, కాపర్‌ డ్యామ్ కు ఎగువన 26.800 మీటర్లు, కాపర్‌ డ్యాంకి దిగువన 15.690 మీటర్లు నీటిమట్టం రికార్డైనట్లు  అధికారులు తెలిపారు. 

(3 / 5)

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 6.018 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు జలవనరులు అధికారులు తెలిపారు. 

(4 / 5)

పట్టిసీమలో గోదావరి నీటిమట్టం 14.802 మీటర్లకు చేరుకోవడంతో, అధికారుల ఆదేశాలతో  17 పంపులు 17  మోటార్లతో నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 2.4060 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు