Nani visits Tirumala: సినిమా రిలీజ్‍కు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని: ఫొటోలు
- Nani visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో నాని. నాని భార్య, కుమారుడితో పాటు సరిపోదా శనివారం హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Nani visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో నాని. నాని భార్య, కుమారుడితో పాటు సరిపోదా శనివారం హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 5)
సరిపోదా శనివారం సినిమా విడుదలకు వారం ముందు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు నేచురల్ స్టార్ నాని. నేడు (ఆగస్టు 24) తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు.
(2 / 5)
నానితో పాటు ఆయన భార్య అంజన, కుమారుడు అర్జున్, సరిపోదా శనివారం సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్.. శ్రీవారి ఆలయానికి వచ్చారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
(3 / 5)
నాని రావడంతో ఒక్కసారిగా ఆలయం వద్ద ప్రజలు గుమిగూడారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది.
(4 / 5)
సరిపోదా శనివారం మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.
ఇతర గ్యాలరీలు