WPL 2024: ముంబై ఇండియన్స్‌కు అలవోక గెలుపు.. ఆర్సీబీ చిత్తు
- WPL 2024 - MI vs RCB: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ జోరు చూపింది. ఈ సీజన్‍లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.
- WPL 2024 - MI vs RCB: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ జోరు చూపింది. ఈ సీజన్‍లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.
(1 / 5)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ (MI W) మరోసారి అదరగొట్టింది. బెంగళూరు వేదికగా నేడు (మార్చి 2) జరిగిన మ్యాచ్‍లో ముంబై 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB W) జట్టుపై విజయం సాధించింది. (PTI)
(2 / 5)
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గాయం వల్ల దూరం కాగా.. గత మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే, నేటి మ్యాచ్‍తో మళ్లీ గెలుపు బాటపట్టింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరును ముంబై కట్టడి చేసింది. (PTI)
(3 / 5)
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేయగలిగింది. ఎలీస్ పెర్రీ (44 నాటౌట్) సత్తాచాటడంతో ఆ మాత్రం స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (9) త్వరగానే ఔటైంది. ముంబై బౌలర్లలో తాత్కాలిక కెప్టెన్ నాట్ స్కీవెర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీశారు. (PTI)
(4 / 5)
ఈ లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముంబై ఇండియన్ ఛేదించింది. 3 వికెట్ల కోల్పోయి 133 రన్స్ చేసి విజయం సాధించింది. అమెలియా కెర్ (40 నాటౌట్) అదరగొట్టగా.. యక్షితా భాటియా (31) రాణించారు. బెంగళూరులో బౌలర్లలో సోఫీ డివైన్, వారెహమ్, శ్రేయాంక పాటిల్‍కు చెరో వికెట్ దక్కింది. (PTI)
ఇతర గ్యాలరీలు