తెలుగు న్యూస్ / ఫోటో /
Medicinal fruits: ఆహారమే ఔషదమైతే.. అలాంటి పండ్లే ఇవన్నీ..
Medicinal fruits: పండ్లు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా శక్తినిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి పండులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
(1 / 6)
పండ్లు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా శక్తినిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి పండులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. (Pixabay)
(2 / 6)
పండ్ల వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు, మినరల్స్ అందుతాయి. కొన్ని సహజంగానే వాటిలో ఔషద విలువల్ని కలిగి ఉంటాయి. అలాంటి మూడు రకాల పండ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. (Pixabay)
(3 / 6)
ఉసిరి: దీన్ని ఆహారంలానే కాకుండా ఔషదంలా కూడా వాడతారు. మన మెదడు - శరీర వ్యవస్థ సమన్వయంలో ఉండేలా కాపాడుతుంది. దీంట్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. (Unsplash)
(4 / 6)
ఆయుర్వేదం ప్రకారం “ద్రాక్ష ఫలోత్తమ”. అంటే అన్ని పండ్లలో ద్రాక్షపండ్లు ఉత్తమమైనవని అర్థం. కేవలం తియ్యని ద్రాక్ష మాత్రమే కాకుండా పులుపు వాటిని కూడా తినడం వల్ల భిన్న రకాల ప్రయోజనాలు కలుగుతాయి. (Unsplash)
(5 / 6)
మద్యపానం మానేయాలనుకునే వారికి ఇదొక మంచి ఔషదం. అలాగే కాలేయ రోగాలు నయం చేయడంలో, తల తిప్పడం, కడుపులో పుండ్లు లేదా మంట ఉన్నా కూడా ఈ పండు నయం చేస్తుంది. దాహం ఎక్కువగా వేస్తున్నపుడు గుప్పెడు ద్రాక్షపండ్లు తింటే దాహం తీరుతుంది. (Shutterstock)
(6 / 6)
అంజీర్: అధిక రక్తపోటుకు ఇది మంచి ఔషదంలా పనిచేస్తుంది. మల బద్ధకం, పైల్స్, ఆహారం జీర్ణం అవ్వడంలో సమస్యలు.. వీటన్నింటినీ నయం చేయడంలో తోడ్పడుతుంది. వీటితో పాటే బరువు తగ్గడంలో, చర్మ వ్యాధుల్ని నివారించడంలో, కొలెస్ట్రాల తగ్గించడంలో సాయపడుతుంది. ఎండు అంజీర్ పండ్లలో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. మహిళలు రోజుకు 3-4 ఎండు అంజీర్ తీసుకుంటే మంచిది. (Pixabay)
ఇతర గ్యాలరీలు