Kangana Ranaut Birthday: పుట్టిన రోజున దేవాలయాలను సందర్శించిన కంగన రనౌత్: ఫొటోలు-kangana ranaut visited baglamukhi and jwala devi temples on her birthday shares pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kangana Ranaut Birthday: పుట్టిన రోజున దేవాలయాలను సందర్శించిన కంగన రనౌత్: ఫొటోలు

Kangana Ranaut Birthday: పుట్టిన రోజున దేవాలయాలను సందర్శించిన కంగన రనౌత్: ఫొటోలు

Published Mar 23, 2024 06:18 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 23, 2024 06:18 PM IST

  • Kangana Ranaut Birthday: బాలీవుడ్ ప్రముఖ నటి కంగన రనౌత్ తన పుట్టిన రోజైన నేడు (మార్చి 23) కొన్ని ఆలయాలను సందర్శించారు. ఆ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమె పోస్ట్ చేశారు.

బాలీవుడ్ నటి కంగన రనౌత్ నేడు (మార్చి 23) తన 37వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నేడు హిమాచల్ ప్రదేశ్‍లోని కొన్ని దేవాలయాలకు ఆమె వెళ్లారు. 

(1 / 9)

(Instagram)

హిమాచల్‍ప్రదేశ్‍లోని బగ్లాముఖి, జ్వాలా దేవి ఆలయాలకు కంగన వెళ్లారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 

(2 / 9)

“ఈ సంవత్సరం కూడా నేను హిమాచల్‍లో బాగ్లాముఖిని దర్శించుకున్న తర్వాత మా శక్తిని దర్శించుకున్నా. అలాగే, కుటుంబంతో కలిసి శక్తిపీఠ్ జ్వాలా వద్దకు కూడా వెళ్లాను” అని కంగన తెలిపారు. ఫొటోలను షేర్ చేశారు. 

(3 / 9)

పుట్టిన రోజున తాను సందర్శించిన ఆలయాల గురించి కంగన ఇన్‍స్టాగ్రామ్‍లో పంచుకున్నారు. అందరూ సంతోషం, ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్టు వెల్లడించారు. 

(4 / 9)

చిన్నతనంలో తాను ఓసారి జ్వాలా దేవిని దర్శించుకున్నానని, మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. 

(5 / 9)

రెడ్, గ్రీన్, గోల్డ్ కలర్లతో కూడిన సంప్రదాయ దుస్తుల్లో కంగన ఆలయాలకు వెళ్లారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకున్నారు. 

(6 / 9)

తన అల్లుడిని ఎత్తుకొని ఆలయంలో కంగన నడుస్తున్న దృశ్యమిది. 

(7 / 9)

తన అల్లుడిని ఎత్తుకొని ఆలయంలో కంగన నడుస్తున్న దృశ్యమిది. 

(Instagram)

తాను సందర్శించిన ఓ ఆలయంలో నిరంతరం ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుందని కంగన పోస్ట్ చేశారు. 

(8 / 9)

పుట్టిన రోజున కంగన రనౌత్ ఆలయాలను సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హ్యాపీ బర్త్ డే క్వీన్ అంటూ చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు