తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Karnataka Tour : తగ్గిన కర్ణాటక ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, ఈ ప్రాంతాలన్నీ చూడొచ్చు
- IRCTC Hyderabad Karnataka Tour : కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC 'టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. జులై 09, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
- IRCTC Hyderabad Karnataka Tour : కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC 'టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. జులై 09, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
(1 / 7)
కర్ణాటకలోని పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలని అనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. జులై 09, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.(image source from unsplash.com)
(2 / 7)
'DIVINE KARNATAKA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, మంగళూరుతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.(image source from unsplash.com)
(3 / 7)
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు బయల్దేరుతుంది. కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(నెంబర్ 12789) రైలులో వెళ్లాల్సి వస్తుంది.రాత్రి అంతా జర్నీ చేస్తారు.(image source from unsplash.com)
(4 / 7)
ఉదయం 09:30 గంటలకు రైలు మంగళూరు సెంట్రల్ చేరుకుంటారు. రైల్వే స్టేషన్ లో పర్యాటకులను పికప్ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. అనంతరం శ్రీ కృష్ణ దేవాలయం, మల్పే బీచ్ సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలో బస చేస్తారు. మూడో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి శృంగేరికి బయలుదేరతారు. శృంగేరి శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత మంగుళూరు బయలుదేరివెళ్తారు. మంగుళూరు చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. మంగుళూరులో రాత్రి బస చేస్తారు.(image source from unsplash.com)
(5 / 7)
ఐదో రోజు Hornadu కు చేరుకుంటారు. అన్నపూర్ణ టెంపుల్ ను దర్శించుకుంటారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. అనంతరం శారందాబ ఆలయానికి చేరుకుంటారు. సాయంత్రం మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. (image source from unsplash.com)
(6 / 7)
మంగళూరు నుంచి చెక్ అవుట్ అయితారు. మంగళాదేవీ ఆలయాన్ని సందర్శిస్తారు. Kadri Manjunatha Templeను కూడా చూస్తారు. సాయంత్రం Tannerbhavi Beachకు వెళ్తారు, సాయంత్రం 7 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. రాత్రి అంతా జర్నీ ఉంటుంది. రాత్రి 11. 40 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. (image source from unsplash.com)
(7 / 7)
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్ ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి, ఏప్రిల్ నెలలతో పోల్చితే ఈ టూర్ ప్యాకేజీ ధరలు తగ్గాయి. గతంలో కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 40 వేలకు పైగా ధర ఉండేది.(image source from unsplash.com)
ఇతర గ్యాలరీలు