తెలుగు న్యూస్ / ఫోటో /
Paris Olympics 2024: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి సంప్రదాయ దుస్తుల్లో భారత అథ్లెట్లు.. చీరకట్టులో సింధు: ఫొటోలు
- Paris Olympics 2024 - Indian Athletes: పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకకు భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొననున్నారు. ఆ ఫొటోలు ఇవే.
- Paris Olympics 2024 - Indian Athletes: పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకకు భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొననున్నారు. ఆ ఫొటోలు ఇవే.
(1 / 5)
అతిపెద్ద క్రీడా సమరం పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరంభ వేడుకకు అంతా రెడీ అయింది. ఈ ఓపెనింగ్ సెర్మనీలో భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొననున్నారు.
(2 / 5)
ఈ ఓపెనింగ్ సెర్మనీలో భారత పురుష అథ్లెట్లు కుర్తా బుండీ ధరించనున్నారు. మహిళా అథ్లెట్లు చీర ధరించనున్నారు. ఈ సంప్రదాయ దుస్తుల్లో ఓపెనింగ్ సెర్మనీలో మార్చ్ చేయనున్నారు. భారతీయ ఉట్టిపడేలా త్రివర్ణ పతాకం రంగులు ఈ దుస్తులపై ఉన్నాయి.
(3 / 5)
భారత బృందం ఈ సంప్రదాయ దుస్తులను ధరించిన ఫొటోలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నేడు (జూలై 26) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ జరగనుందని ఐఓఏ ట్వీట్ చేసింది. మన అథ్లెట్లను ప్రోత్సహించండి అంటూ కోరింది.
(4 / 5)
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవీ సింధు చీర కట్టులో కనిపించారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందానికి పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా ఉండనున్నారు.
ఇతర గ్యాలరీలు