Republic Day: దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు: ఫొటోలు
- దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అన్ని రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి.
- దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అన్ని రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి.
(1 / 11)
74వ గణతంత్ర దినోత్సవాన్ని భారత దేశం నేడు (జనవరి 26) జరుపుకుంటోంది. ఈజిప్ట్ప్రె సిడెంట్ అబ్దుల్ ఫతా ఇల్ సిసి.. ఈ ఏడాది రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా మన దేశానికి వచ్చారు. (HT Photo/Sanjeev Sharma)
(2 / 11)
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నావల్ స్టాఫ్ అడ్మిరల్ చీఫ్ ఆర్ హరికుమార్.. అమర సైనికులకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం.(PTI)
(3 / 11)
సికింద్రాబాద్‍లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‍లో విన్యాసాలు చేస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది.(AFP)
(4 / 11)
ముంబైలోని శివాజీ పార్కులో జాతీయ జెండాను ఆవిష్కరించిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి. (PTI)
(5 / 11)
74వ రిపబ్లిక్ డే సందర్భంగా అగర్తలాలోని ఓ పాఠశాలలో భారీ తివర్ణ పతాకాన్ని చేతబట్టిన విద్యార్థులు. (PTI)
(6 / 11)
చెన్నైలోని కామరాజార్ సలాయ్‍లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాకు వందనం చేస్తున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. (PTI)
(7 / 11)
74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా టెక్ దిగ్గజం గూగుల్.. ప్రత్యేకమైన డూడుల్‍ను రూపొందించింది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, నార్త్ బ్లాక్, సౌత్‍బ్లాక్‍తో పాటు సైనిక విన్యాసాలను సూచిస్తూ హ్యాండ్‍కట్ పేపర్ డిజైన్‍లా ఈ డూడుల‍్‍ను తయారు చేసింది.(PTI)
(8 / 11)
అసోంలోని గౌహతిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కళాకారులు సంప్రదాయ నృత్యం చేస్తున్న దృశ్యం.(PTI)
(9 / 11)
కర్తవ్యపథ్ వద్ద ఈజిప్ట్ ప్రెసిడెంట్‍కు స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత కర్తవ్యపథ్‍లో పరేడ్ జరిగింది. (Bloomberg)
(10 / 11)
భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని, దేశ సంస్కృతిని, సంప్రదాయాలను ఈ గ్రాండ్ పరేడ్ చాటిచెప్పింది. భారత ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ దళాలు విన్యాసాలు చేశాయి. అబ్బురపరిచే విధంగా ఈ విన్యాసాలు సాగాయి. (Bloomberg)
ఇతర గ్యాలరీలు