2024 Hyundai Alcazar: క్రెటా తరహా డిజైన్ తో 2024 హ్యుందాయ్ అల్కాజార్-in pics 2024 hyundai alcazar packs creta like design and more features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024 Hyundai Alcazar: క్రెటా తరహా డిజైన్ తో 2024 హ్యుందాయ్ అల్కాజార్

2024 Hyundai Alcazar: క్రెటా తరహా డిజైన్ తో 2024 హ్యుందాయ్ అల్కాజార్

Sep 11, 2024, 07:07 PM IST HT Telugu Desk
Sep 11, 2024, 07:07 PM , IST

  • 2024 హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ గణనీయమైన అప్ డేటెడ్ డిజైన్ తో వస్తుంది. ఇది కొంతవరకు హ్యుందాయ్ క్రెటాను గుర్తుకు తెచ్చేలా ఉంది. అయితే, ఈ ఫేస్ లిఫ్ట్ లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి.

2024 హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ పూర్తిగా డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేసిన హ్యుందాయ్ క్రెటా తరహాలో ఉంటుంది. అప్ డేటెడ్ అల్కాజార్, గతంలో వచ్చిన మోడల్ తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి.

(1 / 5)

కొత్త అల్కాజార్ తొమ్మిది విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాఖీ, ఫియరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, బ్లాక్ రూఫ్ తో అట్లాస్ వైట్, టైటాన్ గ్రే మ్యాట్, రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాట్. ఈ 2024 అప్ డేటెడ్ హ్యుందాయ్ అల్కాజర్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది, అవి ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం,  సిగ్నేచర్.

(2 / 5)

హ్యుందాయ్ ఆల్కాజార్ ఎస్ యూవీ అప్ డేటెడ్ వెర్షన్ ప్రీ-ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తో పోలిస్తే విస్తృతమైన డిస్టింక్టివ్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది. కొత్త రేడియేటర్ గ్రిల్, అప్ డేటెడ్ ఎల్ఇడి లైటింగ్ ప్యాకేజీ తొ ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది, క్రెటా డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా పూర్తిగా రీడిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ ప్రొఫైల్ ఉంటుంది. అల్లాయ్ వీల్ డిజైన్ కూడా కొత్తగా ఉంది.

(3 / 5)

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్ యూవీ ఇంటీరియర్ ను కూడా అప్ డేట్ చేశారు. 2024 అల్కాజార్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ కీ యాక్సెస్ పొందుతుంది. ఈ ఫీచర్ తో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ వాచ్ ను ఉపయోగించి ఈ కారును లాక్ లేదా అన్ లాక్ చేయవచ్చు, ఇందులో పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

(4 / 5)

హ్యుందాయ్ అల్కాజార్ 2024 ఫేస్ లిఫ్ట్ వర్షన్ లోని పవర్ట్రెయిన్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. అల్కాజార్ 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ యూనిట్, 1.5-లీటర్ డీజిల్ యూనిట్ ఇంజన్ ఆప్షన్స్ తో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 158 బిహెచ్ పి పవర్, 253ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, డీజల్ ఇంజన్ 114బిహెచ్ పి పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆరు, ఏడు సీట్ల లేఅవుట్ ఆప్షన్లలో లభించే హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ మూడు ట్రాన్స్ మిషన్ ఎంపికలను పొందుతుంది, అవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు