తెలుగు న్యూస్ / ఫోటో /
TG Formation Day Celebrations : అంబరాన్నంటిన తెలంగాణ దశాబ్ది సంబరాలు, ట్యాంక్ బండ్ పై ఘనంగా వేడుకలు
- TG Formation Day Celebrations : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై తెలంగాణ పదేండ్ల పండుగ అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- TG Formation Day Celebrations : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై తెలంగాణ పదేండ్ల పండుగ అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
(1 / 6)
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై తెలంగాణ పదేండ్ల పండుగ అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతంగా గుర్తించి "జయ జయహే తెలంగాణ" గీతం వినిపించారు.
(2 / 6)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు.
(3 / 6)
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 కళలను ప్రదర్శించారు.
(4 / 6)
రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' ప్రదర్శనగా ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్ వాక్ ఆకట్టుకుంది. ట్యాంక్ బండ్ ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు పూర్తిగా జనంతో నిండిపోయింది. వేడుకల సమయంలో వర్షం కురవడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం కలిగింది.
(5 / 6)
వర్షం పడుతున్నా తెలంగాణ దశాబ్ది సంబరాలను చూడటానికి ప్రజలు భారీగా వస్తున్నారు. వీక్షకుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లుచేసింది. కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ ఏర్పాటుచేశారు.
ఇతర గ్యాలరీలు