తెలుగు న్యూస్ / ఫోటో /
TS AP Weather : ఇవాళ, రేపు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
- Rains in Telugu States:అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోభారీ వర్షం కురిసింది. ఇక ఇవాళ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం.. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాల వద్ద మరింత బలపడింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. (unsplash.com/)
(2 / 6)
ఏపీలోని ఉత్తరాంధ్రలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం (15-09-2023) రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత వాసులు చేపల వేటకు వెళ్లొద్దని అప్రమత్తం చేశారు.(unsplash.com/)
(3 / 6)
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. (unsplash.com/)
(4 / 6)
ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.(unsplash.com/)
(5 / 6)
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ఇతర గ్యాలరీలు