Dy CM Pawan At Tirumala : తిరుమలలో ప్రాయశ్చిత దీక్ష వివరణ, అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరిన పవన్ కల్యాణ్
- Dy CM Pawan At Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు. బుధవారం ఉదయం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.

(1 / 7)
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల కొండకు బయలుదేరారు. ఆయనతో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఉన్నాయి.
(2 / 7)
తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు.
(3 / 7)
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష విరమణకు తిరుమలకు బయలుదేరారు.
(4 / 7)
తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన పవన్ కల్యాణ్... అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్ కల్యాణ్ రాకతో కూటమి పార్టీల నేతలు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
(5 / 7)
డిప్యూటీ సీఎం పవన్ రాకతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.
(6 / 7)
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. పవన్ కల్యాణ్ దీక్ష విరమణ నేపథ్యంలో గత నెల 30న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు.
ఇతర గ్యాలరీలు