తెలుగు న్యూస్ / ఫోటో /
DIY Beauty Care । మీ సౌందర్య పోషణ కోసం ఇంట్లోనే చేసుకోగల 10 బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు!
DIY Beauty Care: మీ చర్మం, జుట్టు సంరక్షణ కోసం మీకు మీరుగా ఇంట్లోనే చేసుకోగల 10 DIY బ్యూటీ ట్రీట్‌మెంట్‌లను ఇక్కడ చూడండి.
(1 / 10)
చర్మ సంరక్షణ, సౌందర్య ఉత్పత్తులు చాలా ఖరీదైనవిగా ఉండటంతో పాటు కఠినమైన రసాయనాలను కలిగి ఉంటాయి. మీ చర్మం, జుట్టు సంరక్షణ కోసం మీకు మీరుగా ఇంట్లోనే చేసుకోగల సహజమైన 10 DIY బ్యూటీ ట్రీట్‌మెంట్‌లను ఇక్కడ చూడండి.(Pexels)
(2 / 10)
హనీ ఫేస్ మాస్క్: తేనెతో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేటింగ్ చేస్తుంది, హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. (Instagram)
(3 / 10)
కాఫీ స్క్రబ్: సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ బాడీ స్క్రబ్ కోసం కొబ్బరి నూనె , చక్కెర, కాఫీ పొడిని కలపండి, ఇది మీ చర్మాన్ని మృదువుగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది. (Pexels )
(4 / 10)
అవకాడో హెయిర్ మాస్క్: పండిన అవకాడోను మాష్ చేసి, దానికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. దీనిని మీ జుట్టుకు వర్తించండి, ఆరాక కడిగేసుకోండి. ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. (Unsplash)
(5 / 10)
గ్రీన్ టీ టోనర్: ఒక కప్పు గ్రీన్ టీని కాచి చల్లారనివ్వండి. ఈ ద్రావణాన్ని మీ చర్మాన్ని శాంతపరిచి, ప్రకాశవంతం చేసే టోనర్‌గా ఉపయోగించవచ్చు. (Unsplash)
(6 / 10)
యోగర్ట్ ఫేస్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ తేనెతో పెరుగుని మిక్స్ చేసి, మీ ముఖానికి మాస్క్ అప్లై చేయండి. ఇది ముఖాన్ని తేమగా ఉంచుతుంది. (freepik)
(7 / 10)
ఆపిల్ సిడర్ వెనిగర్: ఆపిల్ సిడర్ వెనిగర్‌ను నీటిలో కలపండి, జుట్టును శుభ్రపరుచుకోండి. ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. (Unsplash)
(8 / 10)
అలోవెరా జెల్: ఎండకు కమిలిన చర్మానికి అలోవెరా జెల్‌ని పూయండి, ఉపశమనం ఉంటుంది. (Getty Images)
(9 / 10)
కొబ్బరి నూనె హెయిర్ మాస్క్: డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్ కోసం కొబ్బరి నూనెను వేడి చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. (pexels)
ఇతర గ్యాలరీలు