తెలుగు న్యూస్ / ఫోటో /
Devi Navaratri Utsavalu : నర్సంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు!
- Devi Navaratri Utsavalu : తెలంగాణ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ అందరినీ ఆకర్షిస్తోంది.

(1 / 5)
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల లైట్లతో అలంకరించారు. (HT Telugu)
(2 / 5)
నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్‌లో అయోధ్య రామమందిరం ప్రతిభింబించేలా వేదికను ఏర్పాటు చేశారు. రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.(HT Telugu)
(3 / 5)
అమ్మవారిని ప్రతిష్టించేందుకు ఆలయాన్ని రూపొందించారు. అచ్చం అయోధ్య రామమందిరంలా దీన్ని తీర్చిదిద్దారు. ఆ ఆలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు.(HT Telugu)
(4 / 5)
ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయం ముందే బతుకమ్మ సంబరాలు ప్రారంభం అయ్యాయి. మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలతో వచ్చారు. ఆలయం ప్రాంగణంలో ఆట, పాటలతో సందడి చేశారు. (HT Telugu)
ఇతర గ్యాలరీలు