BRS Chalo Medigadda : రాజకీయం వద్దు, తప్పు జరిగితే శిక్షించండి - మేడిగడ్డను వెంటనే పునరుద్ధరించాలి - బీఆర్ఎస్
- BRS Chalo Medigadda Updates: బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు బృందం మేడిగడ్డలో పర్యటించింది. బ్యారేజీలో తలెత్తిన సమస్యలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రం, రైతులపై పగ వద్దు అని ప్రభుత్వానికి సూచించారు.
- BRS Chalo Medigadda Updates: బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు బృందం మేడిగడ్డలో పర్యటించింది. బ్యారేజీలో తలెత్తిన సమస్యలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రం, రైతులపై పగ వద్దు అని ప్రభుత్వానికి సూచించారు.
(1 / 9)
మేడిగడ్డకు సంబంధించి 1.6 కిలోమీటర్ల బరాజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందన్నారు కేటీఆర్. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడడం సరికాదు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయని గుర్తు చేశారు.(BRS Party Twitter)
(2 / 9)
నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయని గుర్తు చేశారు కేటీఆర్. సాగర్, శ్రీశైలంలో వచ్చిన లీకేజ్‌లను తాము రాజకీయం చేయలేదు. నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నాం అని చెప్పారు.(BRS Party Twitter)
(3 / 9)
మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని, దీని ద్వారా రూ. లక్ష కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.(BRS Party Twitter)
(4 / 9)
“తమపై ఏదైనా కోపం, రాజకీయ వైరం ఉంటే తీర్చుకోండి. మేడిగడ్డను మరమ్మతులు చేయొచ్చని నిపుణులు చెప్పారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం” అని కేటీఆర్ అన్నారు.(BRS Party Twitter)
(5 / 9)
వరదలు వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టి, దాన్ని సురక్షితమైన స్థితికి తేవాలన్నారు కేటీఆర్.(BRS Party Twitter)
(6 / 9)
మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్…. సాగునీరు లేక ఇప్పటికే కరీంనగర్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ పంటలు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. (BRS Party Twitter)
(7 / 9)
పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ…. వానాకాలం లోగా మేడిగడ్డలోని రిపేర్లు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
(8 / 9)
కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని, అసలు నిజాలను ప్రజలకు చెప్పే క్రమంలో ఈరోజు పర్యటన మొదటి అడుగు మాత్రమే అని బీఆర్ఎస్ నేతలు అన్నారు. మిగతా బ్యారేజీలను కూడా సందర్శిస్తామని చెప్పారు.
(9 / 9)
మేడిగడ్డలో కుంగింది మూడు పిల్లర్లే అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమే ఇది కాకుండా సుందిళ్ల, అన్నారం బరాజ్ లు, పంప్ హౌస్ లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, రిజర్వాయర్లు, ఓపెన్ కెనాళ్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సిస్టమ్ అభివృద్ది చేసి ఉందన్నారు. వీటన్నింటినీ పక్కకు పెట్టి కుంగిన మూడు పిల్లర్లను చూపి ఇదే మొత్తం ప్రాజెక్ట్ అని దుర్భుద్దితో దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మేడిగడ్డను సరిచేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే గడపగడపకూ వెళ్లి రైతులను చైతన్యం చేస్తామన్నారు.. (BRS Party Twitter)
ఇతర గ్యాలరీలు