తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana : బీర్ల ధరలు పెంపు...! మందుబాబులకు షాక్ తప్పదా..?
- Beer Prices in Telangana : తెలంగాణలోని బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే బీర్ల ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంపై సర్కార్ ప్రాథమికంగా కసరత్తు షురూ చేసినట్లు సమాచారం.
- Beer Prices in Telangana : తెలంగాణలోని బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే బీర్ల ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంపై సర్కార్ ప్రాథమికంగా కసరత్తు షురూ చేసినట్లు సమాచారం.
(1 / 6)
త్వరలోనే మందుబాబులకు షాకింగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.(image source from unsplash.com)
(2 / 6)
ప్రతి రెండేళ్లకు గానూ బీర్ల ఉత్పత్తి కేంద్రాల (బ్రూవరీలు)కు చెల్లించే ధరలను ప్రభుత్వం పెంచుతుంది. ఇది సాధారణంగానే జరుగుతుంది. ఈ ఏడాది పెంచే విషయంపై బ్రూవరీలు ఇప్పటికే ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తిని ఇచ్చాయి. (image source from unsplash.com)
(3 / 6)
ఈసారి రూ. 20-25 పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే…. ప్రస్తుతం ఉన్న బీర్ల ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.(image source from unsplash.com)
(4 / 6)
ప్రస్తుతం వైన్స్ షాపులో లైట్ బీర్ ధర రూ. 150గా ఉంది. స్ట్రాంగ్ బీర్లలో చూస్తే బ్రాండ్ ను బట్టి ధరలు ఉన్నాయి. (image source from unsplash.com)
(5 / 6)
ఒకవేళ బీర్ల రేట్లు పెంచితే… లైట్ బీర్ ధర రూ. 160 - రూ.165 మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ధరల పెంపుపై బెవరేజెస్ కార్పొరేషన్ తో పాటు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.(image source from unsplash.com)
ఇతర గ్యాలరీలు