Ayushmann Khurrana: ట్రాన్స్‌జెండర్ల ఫుడ్ ట్రక్‍ను ప్రారంభించిన బాలీవుడ్ హీరో: వివరాలు
- Ayushmann Khurrana: ట్రాన్స్‌జెండర్ల కోసం ఓ ఫుడ్‍ట్రక్‍ను బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రారంభించారు. ఈ ఫుడ్ ట్రక్‍ను ఆరంభించి.. తాళాలను వారికి అందజేశారు. ఆ ఫొటోలు, వివరాలు ఇక్కడ చూడండి.
- Ayushmann Khurrana: ట్రాన్స్‌జెండర్ల కోసం ఓ ఫుడ్‍ట్రక్‍ను బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రారంభించారు. ఈ ఫుడ్ ట్రక్‍ను ఆరంభించి.. తాళాలను వారికి అందజేశారు. ఆ ఫొటోలు, వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 7)
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇటీవల ఛండీగడ్‍లోని జికాపూర్‌లో ట్రాన్స్‌జెండర్ల ఫుడ్ ట్రక్‍ను ఆయన ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్ల పురోగతికి మద్దతుగా నిలిచారు. (Instagram/@ayushmannk)
(2 / 7)
ట్రాన్స్‌జెండర్లను ప్రోత్సహించేందుకు, సమాజంలో వారు కూడా భాగమని చెప్పేందుకు తాను ఈ ఫుడ్ ట్రక్‍ను ప్రారంభించానని ఏఎన్‍ఐతో ఆయుష్మాన్ ఖురానా చెప్పారు.(Instagram/@ayushmannk)
(3 / 7)
ట్రాన్స్‌జెండర్లకు మరింత మంది సహాయంగా నిలిచేలా స్ఫూర్తినిచ్చేందుకు తీసుకున్న చిన్న అడుగు ఇది అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. (Instagram/@ayushmannk)
(4 / 7)
ఈ ఫుడ్‍ట్రక్‍ను ప్రారంభించిన ఆయుష్మాన్ ఖురానాకు పంజాబ్ యూనివర్సిటీ తొలి ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్, ప్రముఖ అడ్వకేట్ ధనంజయ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీకి మద్దతునిస్తున్నందుకు ఆయుష్మాన్‍కు థ్యాంక్యూ చెబుతూ ట్వీట్ కూడా చేశారు. (Instagram/@mxdhananjay)
(5 / 7)
ఈ ఫుడ్‍ట్రక్‍ను ప్రారంభించిన ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లోనూ పోస్ట్ చేశారు ఆయుష్మాన్ ఖురానా. ఒకరినొకరం పర్పసరం అంగీకరించుకుంటే భారత్ మరింత అత్యుత్తమంగా ఉంటుందని ఆయన క్యాప్షన్ రాశారు. ఫుడ్ వెంచర్ కోసం ఛండీగడ్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు, ధనంజయ్ చౌహన్‍కు విషెస్ తెలియజేస్తున్నారనని పేర్కొన్నారు. (Instagram/@mxdhananjay)
(6 / 7)
ఫుడ్ ట్రక్ వద్ద ధనంజయ్ చౌహాన్‍తో కలిసి ఆయుష్మాన్ ఖురానా కెమెరాలకు పోజు ఇచ్చిన దృశ్యమిది. (Instagram/@mxdhananjay)
ఇతర గ్యాలరీలు