తెలుగు న్యూస్ / ఫోటో /
Asian Games Day 2: ఏషియన్ గేమ్స్ రెండో రోజు ఇండియాకు పతకాల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
Asian Games Day 2: ఏషియన్ గేమ్స్ రెండో రోజు ఇండియాకు పతకాల పంట పండించింది. రెండో రోజు రెండు గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 6 మెడల్స్ రావడంతో ఇండియా మొత్తం మెడల్స్ సంఖ్య 11కు చేరింది.
(1 / 7)
Asian Games Day 2: ఏషియన్ గేమ్స్ రెండో రోజు 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ వచ్చింది. రుద్రాంష్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దివ్యాంశ్ పన్వర్ లు వరల్డ్ రికార్డుతో ఈ గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.(PTI)
(2 / 7)
Asian Games Day 2: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ చారిత్రక గోల్డ్ మెడల్ సాధించింది. ఏషియన్ గేమ్స్ లో తొలిసారి మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఫైనల్లో శ్రీలంకను 19 పరుగులతో ఇండియన్ టీమ్ చిత్తు చేసింది.(IOA)
(3 / 7)
Asian Games Day 2: పురుషుల రోయింగ్‌లో భారత్‌కు చెందిన జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.(AFP)
(4 / 7)
Asian Games Day 2: ఆసియా క్రీడల్లో పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్ ఫైనల్లో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్య పతక విజేతలు సత్నామ్ సింగ్, పర్మీందర్ సింగ్, జాకర్ ఖాన్, సుఖ్మీత్ సింగ్‌లకు పతకాలను అందజేశారు.(AFP)
(5 / 7)
Asian Games Day 2: భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాలు సాధించాడు.(ANI)
(6 / 7)
Asian Games Day 2: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆదర్శ్ సింగ్, అనీష్, విజయవీర్ సిద్ధూ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలిచారు.(REUTERS)
ఇతర గ్యాలరీలు