AP Rains : ఏపీపై అల్పపీడనం ప్రభావం, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
- AP Rains : పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి, మన్యం, అల్లూరి, విశాఖపట్నం సహా పలు జిల్లా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం... పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందన వాతావరణ శాఖ తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.
(2 / 6)
ఏపీలో వాతావరణం చల్లబడింది. గత రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తు్న్నాయి.
(3 / 6)
ఇవాళ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
(4 / 6)
రేపు(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. (HT)
(5 / 6)
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
ఇతర గ్యాలరీలు