TDP Janasena First list : 118 మంది అభ్యర్థులతో టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా , మినిమం డిగ్రీ చదివిన వాళ్లే!
- TDP Janasena First list : తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు జోరు పెంచాయి. రానున్న 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితాను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. 118 స్థానాల్లో టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

(1 / 8)
తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడి జాబితాను ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం విడుదల చేశారు.
(2 / 8)
118 మంది ఉమ్మడి అభ్యర్థులతో తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకుని ఈ జాబితా ప్రకటించామన్నారు.
(3 / 8)
118 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో ఇరుపార్టీలకు కూడా ఎక్కువగా కొత్త అభ్యర్థులకు, యువకులకు, బీసీ, ఎస్సీ, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు.
(4 / 8)
తొలి జాబితాలో 94 మంది.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగనున్నారు. జనసేన నుంచి 24 స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఈ లిస్ట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్న 28 మంది అభ్యర్థులు, గ్రాడ్యుయేట్ డిగ్రీలతో 50 మంది అభ్యర్థులు, 3 డాక్టర్లు, 2 Ph.D, 1 IAS ఆఫీసర్ ఉన్నారు.
(5 / 8)
అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రతలు తీసుకున్నామని చంద్రబాబు, పవన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1 కోటి 3 లక్షల 33 వేల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్ట్ ను సిద్ధం చేశామన్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలు, గొంతులను అసెంబ్లీలో వినిపించే వారికి ఈ లిస్ట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
(6 / 8)

(7 / 8)
టీడీపీ నుంచి 94 అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. టెక్కలి నుంచి కింజరాపు అచ్చన్నాయుడు, మంగళగిరిలో నారా లోకేశ్, హిందూపూర్ లో నందమూరి బాలకృష్ణ, కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారు.
ఇతర గ్యాలరీలు