(1 / 5)
టాలీవుడ్ ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‍లో నేడు (అక్టోబర్ 17) అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్.
(Hindustan Times)(2 / 5)
2021కు గాను 69వ జాతీయ అవార్డులను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ‘పుష్ప 1: ది రైజ్’ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‍కు దక్కింది. నేడు ఆయన ఆ పురస్కారం స్వీకరించారు.
(PTI)(3 / 5)
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృషించారు. ఈ అవార్డుల వేడుకకు వైట్ సూట్ ధరించి హాజరయ్యారు ఐకాన్ స్టార్.
(ANI)(4 / 5)
అవార్డుల వేడుకలో నటి కృతి సనన్‍తో సెల్ఫీ దిగారు అల్లు అర్జున్. పుష్ప చిత్రంలో ఫేమస్ అయిన ‘తగ్గేదెలే’ సిగ్నేచర్ మూవ్‍మెంట్ చేస్తూ ఇద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. మిమీ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా కృతి అవార్డు తీసుకున్నారు.
(Shrikant Singh)(5 / 5)
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆరు పురస్కారాలు దక్కాయి. పుష్పకు గాను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్‍కు కూడా పురస్కారం వచ్చింది. సినీ గేయ రచయిత చంద్రబోస్‍తో పాటు ఉప్పెన చిత్రానికి కూడా నేషనల్ అవార్డు దక్కింది. మొత్తంగా 2021కు గాను తెలుగుకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. (అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ కోసం దర్శకుడు రాజమౌళి అవార్డు తీసుకుంటున్న దృశ్యం)
(Rahul Singh)ఇతర గ్యాలరీలు