తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya Rai | రెడ్ కార్పెట్‌పై.. దేశీ గ్లామ్‌ని జోడించిన ప్రేమ దేవత
- ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరుసగా 3వ రోజున పాల్గొంది. డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన లేత గులాబీ రంగు గౌనులో రెడ్ కార్పెట్ నడిచి ఫోటోలకు ఫోజులిచ్చింది. భారతీయ డిజైనర్‌ని ఎంచుకుని.. రెడ్ కార్పెట్‌పై దేశీ గ్లామ్ పవర్‌ని తీసుకొచ్చింది.
- ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరుసగా 3వ రోజున పాల్గొంది. డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన లేత గులాబీ రంగు గౌనులో రెడ్ కార్పెట్ నడిచి ఫోటోలకు ఫోజులిచ్చింది. భారతీయ డిజైనర్‌ని ఎంచుకుని.. రెడ్ కార్పెట్‌పై దేశీ గ్లామ్ పవర్‌ని తీసుకొచ్చింది.
(1 / 10)
75th Cannes Film Festival: ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022.. 3వ రోజున ఏస్ ఇండియన్ కోటూరియర్ గౌరవ్ గుప్తా రూపొందించిన మెరిసే లేత గులాబీ రంగు గౌనులో రెడ్ కార్పెట్ మీద నడిచింది. భారతీయ డిజైనర్‌ని ఎంచుకుని ఫెస్టివల్ డి కేన్స్‌కు దేశీ ప్రాతినిధ్యాన్ని తీసుకువచ్చింది ఐశ్వర్య. ఆన్‌లైన్‌లో ఆమె లుక్‌కి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ.. ఆ లుక్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. (AP)
(2 / 10)
ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 3వ రోజు కోసం వెండి అలంకారాలతో కూడిన లేత గులాబీ రంగు గౌనును ఎంచుకుంది. ఆమె డ్రెస్‌కి తగ్గట్లు ఎథెరియల్ ఉపకరణాలను జత చేసింది.(REUTERS)
(3 / 10)
ఐశ్వర్య వీనస్ స్కల్ప్చర్ గౌను ధరించింది. ఇది కస్టమ్ మేడ్ గౌరవ్ గుప్తా కోచర్ సమిష్టి. ఇది అందం, ప్రేమ దేవత అయిన వీనస్ నుంచి ప్రేరణ పొందిందని గౌరవ్ తెలిపారు. డ్రెస్ గురించి ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియాలో "Rising from the scalloped shell; she transitions from the infinite, pure as a pearl." అంటూ రాసుకొచ్చాడు. (REUTERS)
(4 / 10)
ఆర్మగెడాన్ టైమ్ ఫిల్మ్ స్క్రీనింగ్‌కు హాజరయ్యేందుకు ఐశ్వర్య లేత గులాబీ రంగు డ్రెస్‌ను ధరించింది. ఇది చతురస్రాకారపు నెక్‌లైన్, అలల భ్రమను కలిగించే లేయర్డ్ ఫాబ్రిక్, హేమ్, ఐశ్వర్య ఫ్రేమ్‌ను హైలైట్ చేసే ఫిగర్-ఎక్స్‌ట్యుయేటింగ్ సిల్హౌట్‌తో ఈ డ్రెస్‌ను రూపొందించారు.(AFP)
(5 / 10)
గౌరవ్ గుప్త రూపొందించిన గౌనులో ఎట్రాక్టివ్ స్లీవ్స్, వెండి అలంకారాలు కూడా ఉన్నాయి. కానీ భుజాల నుంచి పైకి లేచి.. తల వెనుక నుంచి వచ్చిన ఒక పెద్ద హాలో మొత్తం డ్రెస్కే హైలైట్‌గా నిలిచింది. (AFP)
(7 / 10)
డైమండ్ రింగ్‌లు, మిరుమిట్లు గొలిపే ఇయర్ కఫ్‌లు, మ్యాచింగ్ హైహీల్స్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది.(REUTERS)
(8 / 10)
బ్లాక్ ఐలైనర్, కోహ్ల్డ్ కళ్లు, మెరిసే గులాబీ రంగు లిప్‌స్టిక్, హెవీ మాస్కరా, షైనీ మేకప్, ఎర్రబడిన బుగ్గలు, షార్ప్ కాంటౌరింగ్, బీమింగ్ హైలైటర్.. ఐశ్వర్య గ్లామ్‌ను మరింత పెంచాయి. (REUTERS)
(9 / 10)
ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కేన్స్‌కు హాజరైంది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఫ్యామిలీతో కలిసి ఈవెంట్‌లకు హాజరైంది ఈ నీలి కళ్ల భామ. (REUTERS)
ఇతర గ్యాలరీలు