తెలుగు న్యూస్ / ఫోటో /
Lying in Relationships | ఈ 5 అబద్ధాలు చెబితే బంధాలు తెగిపోతాయి!
- Lying in Relationships : ఏ బంధాలైనా నమ్మకంపైనే నిలబడతాయి. ఒకరి మీద నమ్మకం కలగాలంటే నిజాయితీగా ఉండటం ముఖ్యం. దాపరికలకు, అబద్ధానికి తావుండకూడదు.
- Lying in Relationships : ఏ బంధాలైనా నమ్మకంపైనే నిలబడతాయి. ఒకరి మీద నమ్మకం కలగాలంటే నిజాయితీగా ఉండటం ముఖ్యం. దాపరికలకు, అబద్ధానికి తావుండకూడదు.
(1 / 8)
అబద్ధంతో ఆ క్షణంలో ప్రేమను పొందవచ్చు, కానీ నిజం తెలిసిన నాడు ఆ బంధం బీటలు వారడం ఖాయం. 5 అబద్ధాలు బంధంలో చీలిక తేవడానికి కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. అవేంటో చూడండి.
(2 / 8)
బంధాలు ఏర్పరుచుకోవడం సులభమే, కానీ దానిని కొనసాగించడం చాలా కష్టం. మీ రిలేషన్‌షిప్‌ను దృఢంగా మార్చుకోవడానికి పొరపాటున కూడా మీ జీవిత భాగస్వామికి ఇలాంటి అబద్ధాలు చెప్పకండి, అది మీ మధ్య చిచ్చు పెడుతుంది.
(3 / 8)
మీ మాజీ ప్రియుల గురించి అబద్ధాలు; మీ మాజీ ప్రియులు లేదా మాజీ భార్యతో సన్నిహితంగా ఉండటం మీ వ్యక్తిగతం కావచ్చు, కానీ మీ ప్రస్తుత భాగస్వామి వద్ద ఈ సత్యాన్ని దాచడం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.
(4 / 8)
అబద్ధపు భావోద్వేగాలు: మీ భాగస్వామితో కలిసి జీవిస్తున్నప్పుడు ప్రేమ లేకున్నా ప్రేమిస్తున్నట్లుగా, గొడవలు జరుగుతున్నా ఆనందంగా ఉంటున్నట్లుగా భావోద్వేగాలను నటిస్తే, మీ బంధం మరింత బలహీనమవుతుంది.
(5 / 8)
మీ ఉద్యోగం గురించి అబద్ధం; మీరు మీ భాగస్వామికి మీ ఉద్యోగం ఒకటి చెప్పి, మీరు చేసే పని వేరొకటి అయితే.. అది తెలిసిన నాడు మీకు ఉంటుంది, ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏం ఉండదు.
(6 / 8)
వేర్వేరు నిజాలు మీ భాగస్వామికి ఒక నిజం, మరొకరికి అసలు నిజం చెపినపుడు లేదా నిజం వేరొకరి ద్వారా మీ భాగస్వామికి తెలిసినపుడు మీపై నమ్మకం పోతుంది.
(7 / 8)
మీరు వ్యక్తిత్వం ఎలాంటిది, అది మంచైనా.. చెడైనా మీ భాగస్వామికి మీరు ఏమిటి, మీ నిజస్వరూపం ఏమిటి అనేది ముందునుంచే తెలిసి ఉండాలి. వ్యక్తిత్వాన్ని అబద్ధం చేస్తే, మీకు తిరిగి అదే లభిస్తుంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు