తెలుగు న్యూస్ / ఫోటో /
Hidden Islands in India | ఏకాంతంగా గడపటానికి.. ఎవరికి తెలియని ద్వీపాలు ఇవిగో!
- మీకు చుట్టూ సముద్రం ఉండే ప్రశాంతమైన ద్వీపాలలో విహరించటం ఇష్టమా? అయితే అండమాన్ నికోబార్ కాకుండా ఇండియాలోనే అంతగా తెలియని అలాంటి కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మీరు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులను పొందుతారు.
- మీకు చుట్టూ సముద్రం ఉండే ప్రశాంతమైన ద్వీపాలలో విహరించటం ఇష్టమా? అయితే అండమాన్ నికోబార్ కాకుండా ఇండియాలోనే అంతగా తెలియని అలాంటి కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మీరు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులను పొందుతారు.
(1 / 7)
ఐలాండ్లలో హాలీడేస్ ఎంజాయ్ చేయాలంటే విదేశాలు ఎందుకు? మన భారతదేశంలోనే మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసే అలాంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. చాలా మందికి పెద్దగా పరిచయం లేని అలాంటి కొన్ని ద్వీప ప్రదేశాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.(Representative Image (Unsplash))
(2 / 7)
మజులి, అస్సాం: అస్సాంలోని మజులి ఐలాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని మీరు మీ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. అయితే విచారకరమైన వార్త ఏమిటంటే, హిమాలయాల్లో ఉష్ణోగ్రత పెరిగి, మంచు కరిగడం వలన బ్రహ్మపుత్ర నదిలో ఆకస్మిక వరదలు వస్తాయి.(Instagram/@majuli_island)
(3 / 7)
కవ్వాయి, కేరళ: పయ్యనూర్ సమీపంలో ఉన్న కవ్వాయి అనేది కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలలో బ్యాక్ వాటర్స్ చుట్టూ విస్తరించి ఉన్న చిన్నచిన్న ద్వీపాల సమూహం. ఇది కన్నూర్‌కు ఉత్తరాన 42 కిలోమీటర్లు, కాసర్గోడ్ కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.(Instagram/@jk_mocktails)
(4 / 7)
పాంబన్, తమిళనాడు: దీనిని రామేశ్వరం ద్వీపం అని కూడా పిలుస్తారు. వైశాల్యం పరంగా తమిళనాడులో ఇదే అతిపెద్ద ద్వీపం. మీరు కొంత ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే, ఇది అద్భుతమైన ప్రదేశం.(Instagram/@trendz_of_pamban)
(5 / 7)
నేత్రాణి, కర్ణాటక: దీనిని పావురాల ద్వీపం అని కూడా పిలుస్తారు, ఇది మురుడేశ్వర తీరంలో ఉంది. మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఈ ద్వీపంలో డైవింగ్, స్నార్కెలింగ్ వంటి వాటర్ అడ్వెంచర్లకు కూడా ప్రసిద్ధి.(Instagram/@hikerwolf)
(6 / 7)
దివార్, గోవా: ఈ సుందరమైన ద్వీపం పాంజిమ్ నుంచి కేవలం 10 కి.మీ దూరంలో మండోవి నదిపై ఉంది. ఈ ద్వీపం కొన్ని ఆసక్తికరమైన సంస్కృతులకు నిలయం.(Instagram/@oneboard.app )
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు