Goa Tour | ఈ వేసవిలో గోవా టూర్ ప్లాన్ చేస్తే.. వీటిని అస్సలు మిస్ కావొద్దు!-these offbeat experiences that you must not miss in your goa tour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Offbeat Experiences That You Must Not Miss In Your Goa Tour

Goa Tour | ఈ వేసవిలో గోవా టూర్ ప్లాన్ చేస్తే.. వీటిని అస్సలు మిస్ కావొద్దు!

HT Telugu Desk HT Telugu
Apr 21, 2022 06:26 PM IST

గోవా కేవలం బీచ్‌లకు మాత్రమే ప్రసిద్ధి కాదు ఎన్నో చారిత్రక కట్టడాలు, పురాతన శివాలయాలు, గ్రామాల్లో సరదా ఆటలు, అరుదైన పక్షుల కిలకిలరావాలు ఇలా ఎన్నో ఉన్నాయి, మీరు గోవా టూర్ ప్లాన్ చేస్తే ఇలాంటి ఆఫ్‌బీట్ యాక్టివిటీస్ కూడా మీ లిస్టిలో చేర్చుకోండి..

Goa
Goa (Unsplash)

నలుగురు ఫ్రెండ్ కలిసి ఎక్కడికైనా వెళ్లాలి అంటే ముందుగా గుర్తుకొచ్చే గమ్యస్థానం గోవా. చాలా మందికి గోవా అనగానే అందాలు ఆరబోసిన బీచులు, ఎగసిపడే మద్య పానీయాలు, ఆటవిడుపు కార్యక్రమాలు ఇవే గుర్తుకువస్తాయి. ఇంతకంటే కావాల్సిందేంటి? ఇక ఉత్సాహం ఉరకలేస్తుంది. గోవా వెళ్లాలని డిసైడ్ అవుతారు, ఎలా వెళ్లాలి.. ఎప్పుడు వెళ్లాలి? అంటూ ప్లాన్స్ వేసుకుంటారు. అయితే గోవా విషయంలో సాధారణంగా ఆ ప్లాన్ వాయిదాపడుతుంది. ఇంతలో ఉన్నచోటనే పార్టీ చేసుకొని ఇంకేం గోవా వెళ్తాం .. గో.. గోవా.. గాన్ అని ఉసూరుమనిపిస్తారు. మీ జీవితంలో కూడా ఒక్కసారైనా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది, కాదంటారా?

అయితే గోవా కేవలం బీచ్ లకు మాత్రమే పరిమితం కాదు. అక్కడ ఇంకా ఎన్నో ఇతర చూడదగ్గ ప్రదేశాలు, పురాతన కాలం నాటి శివాలయాలు, అడవులు -జలపాతాలు, అడ్వెంచర్ల కోసం ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ అందిస్తున్నాం

వైల్డ్ లైఫ్ గోవా

గోవాలో బోండ్లా నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ పులులు, ఏనుగుల, ఎలుగుబంట్ల నుంచి వివిధ రకాల వన్యప్రానులను చూడొచ్చు. సఫారీలో ప్రయాణించవచ్చు. ఇంకా ఎన్నో రకాల అరుదైన పక్షులు, సరిసృపాలు, పూలతోటలు, వృక్షజాతులను చూడవచ్చు.

అడ్వెంచర్లకు గోవా

బీచ్ పారాగ్లైడింగ్‌ కాకుండా గోవాలోని 'కాబో డి రామా' అనే చోటుకు వెళ్తే ఇదొక లోకం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. రెగ్యులర్ మార్గం కాకుండా రాతి మార్గంలో ట్రెక్కింగ్ చేస్తే ఎన్నో అందమైన దృశ్యాలు మీకు కనువిందు చేస్తాయి. ఈ దారిలో అనేక రహస్యమైన బీచ్‌లు ఉన్నాయి. అందులో పెబ్బుల్ బీచ్ గోవాలోని మిగతా బీచ్ లకు విభిన్నం.

గోవాలో ఫిషింగ్

మీకు చేపలు పట్టే అభిరుచి ఉంటే మోబోర్, కేవెలోసిమ్ అనే ప్రదేశాలు ఉన్నాయి. మంచినీటిలో సముద్రపు చేపల వేట ఇక్కడ ప్రత్యేకత. నది నుండి సముద్రం వరకు బోటింగ్ చేసుకుంటూ చేపల వేట చేయవచ్చు. మీకు చిక్కిన చేపలను వండి ఇస్తారు కూడా. ఈ మార్గంలో మీకు డాల్ఫిన్లు కూడా ఎదురుపడవచ్చు.

పీక్- ఎ- బూ గోవా

గోవాలోని కుర్ది గ్రామంలో మే నుంచి జూన్ కాలంలో దాగుడుమూతల ఆటల పోటీలు నిర్వహిస్తారు. నీటిలోకి వెళ్లి దాక్కోవడం, పైకి తేలడం. ఆసక్తి ఉంటే ఎవరైనా పాల్గొనవచ్చు. ఇది ఒక చారిత్రక గ్రామం రిజర్వాయర్ కోసం ముంపుకు గురైంది. ఇప్పుడిక్కడ మొత్తం నీరు నిండి పోయింది గ్రామం జ్ఞాపకాల్లో మాత్రమే మిగిపోయింది. ఈ గ్రామంలో 18వ శతాబ్దానికి చెందిన సోమేశ్వరాలయం, సేక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్ చాపెల్ చర్చ్, 634 కుటుంబాలతో సందడిగా ఉండే గ్రామం నిశబ్దంగా జలసమాధి అయింది. ఆ జ్ఞాపకాల కోసమే అక్కడ దాకుడు మూతల ఆటలు ఆడిస్తారు. పాశ్చాత్య సంస్కృతి కనిపించే గోవాలో సైతం అతిపురాతనమైన శివాలయాలు ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి.

ఇంకా పశ్చిమ కనుమల అందాలు, లోతట్టు ప్రాంతాలు ఇక్కడి ప్రకృతి రమణీయత మీకు కనువిందు చేస్తూ మధురానుభూతులు పంచుతాయి. కాబట్టి ఈ సారి గోవా ప్లాన్ చేస్తే ఇవన్నీ చూడటానికి ప్లాన్ చేసుకోండి. మీ గోవా టూర్ విజయవంతం అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్