తమిళనాడులో గవర్నర్ అధికారాలకు కత్తెర
వీసీల నియామకంలో గవర్నర్‌కు ఉన్న అధికారాలను కుదిస్తూ తమిళనాడు అసెంబ్లీలో బిల్లు పాసైంది.
తమిళనాడులో గవర్నర్ అధికారాలకు కోత విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియమకంలో గవర్నర్లకు ఉన్న అధికారాలను కుదిస్తూ విద్యాశాఖ ప్రతిపాదించిన బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. గవర్నర్ అధికారాలను తగ్గించడమే లక్ష్యంగా తమిళనాడు విద్యాశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విద్యాశాఖ తరపున ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొణ్ముడి బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు ద్వారా తమిళనాడులో విసీల నియామక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. విద్యాశాఖ ప్రతిపాదించిన బిల్లును ప్రతిపక్ష పిఎంకె మద్దతు తెలపగా. బీజేపీ, అన్నాడిఎంకెలు వ్యతిరేకించాయి. అన్నాడిఎంకె సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా విశ్వవిద్యాలయాల కులపతుల్ని గవర్నర్లు నియమించడం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ గుర్తు చేశారు. తెలంగాణ, కర్ణాటకలలో కూడా వీసీల నిమకంలో గవర్నర్ల పాత్ర లేదని చెప్పారు.
టాపిక్