ఆ లాయర్‌కు జైలు, జరిమానా...
వర్చువల్ విచారణలో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన న్యాయవాదికి మద్రాసు హైకోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా ఖరారు చేసింది. మద్రాసు హైకోర్టు విచారణలో ఉండగా తన ముందు కెమెరా ఉందన్న సంగతి మరిచి న్యాయవాది సంతాన కృష్ణన్ అసభ్యంగా ప్రవర్తించాడు.
వర్చువల్ విచారణలో మహిళతో అసభ‌్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయిన న్యాయవాదికి న్యాయస్థానం గతవారం భారీ ఫైన్ విధించింది. గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలు విచారణల్ని ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించాయి. ఈ క్రమంలో మద్రాసు హైకోర్టు వర్చువల్ విధానంలో విచారణ జరుపుతుండగా ఓ న్యాయవాది అసభ్యంగా ప్రవర్తించాడు. ఆన్‌లైన్ కెమెరా ముందున్నాననే సంగతి మరచి అదే గదిలో ఉన్న మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు.
తమిళనాడుకు చెందిన న్యాయవాది సంతనకృష్ణన్ కంప్యూటర్ పక్కన నిలబడి ఉన్న మహిళను దగ్గరకు లాక్కుని అసభ్యంగా తాకుతూ ప్రవర్తించడం న్యాయమూర్తుల కంట పడింది. అదే కేసు వర్చువల్ కోర్టు విచారణలో ఉన్న మరికొందరు తమ సెల్‌ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఆ తర్వాత అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో మద్రాసు హైకోర్టు న్యాయవాది సంతానకృష్ణన్‌పై సస్పెన్షన్ విధించింది. ఈ పరిణామాలను మద్రాసు హైకోర్టు జస్టిస్ ప్రకాశ్ నేతృత్వంలో ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆ తర్వాత వర్చువల్ విచారణలో ఏమి జరిగిందో నిగ్గు తేల్చాలని సిబిసిఐడి విచారణకు ఆదేశించింది.
కోర్టు విచారణ సమయంలో సంబంధిత న్యాయవాది ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధించాలని బార్ కౌన్సిల్‌కు సిఫార్సు చేసింది. దీంతో తమిళనాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కేసు దర్యాప్తులో సదరు మహిళను ఘటనలో బాధితురాలిగా న్యాయస్థానం గుర్తించింది. ఆమె ప్రమేయం లేకున్నా న్యాయవాది బలవంతంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్దారించింది. దీంతో బాధితురాలి నాలుగు లక్షల రుపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దీంతో న్యాయవాది సంతానకృష్ణ గత వారం ఆమెకు పరిహారం చెల్లించారు. మంగళవారం జరిగిన తుది విచారణలో సంతాన కృష్ణన్‌కు రెండు వారాల జైలు శిక్ష, ఆరువేల రుపాయల జరిమానా ఖరారు చేశారు. ఇప్పటికే ఆయన 34 రోజులు జైల్లో ఉండటంతో జైలు శిక్ష పూర్తైనట్లైంది.
సంబంధిత కథనం
టాపిక్