Gold and Silver Rates Today| మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,530లుగా ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,400లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530లుగా ఉంది.
బంగారం ధర పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్న పసిడి నిన్నటితో పోలిస్తే ఈ రోజు బాగా పెరిగింది. మంగళవారంతో పోలిస్తే బుధవారం(ఫిబ్రవరి 09) నాటికి నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200లు పెరిగి రూ.45,400లకు చేరింది. ఇదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.230లకు పెరిగి రూ.49,300లకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరల ఈ విధంగా ఉన్నాయి.
దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,530లుగా ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,400లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530లుగా ఉంది. విజయవాడలో ఇదే 22 క్యారెట్ల బంగారం రూ.45400లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.49,530లుగా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,590లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,740లుగా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,400లుగా ఉంటే.. 24 క్యారెట్ల కనకం ధర రూ.49,530లుగా ఉంది.
వెండి ధర కూడా పెరిగింది..
వెండి ధరల విషయానికొస్తే బుధవారం నాటికి కొంచెం పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.65,600లు ఉంది. అయితే దేశ రాజధాని దిల్లీలో వెండి ధర తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రూ.61,900లకు చేరింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సుకు 0.07 శాతం దిగివచ్చింది. ఫలితంగా పసిడి ఔన్సుకు 1826 డాలర్లకు క్షీణించింది. వెండి మాత్రం పెరిగింది. వెండి ధర ఔన్సుకు 0.04 శాతం పెరుగుదలతో 23.31 డాలర్లకు ఎగసింది.
సంబంధిత కథనం