పిల్లల కోసం కోవిడ్19 వ్యాక్సిన్ ఉందా? ఇండియాలో ఆమోదం పొందిన టీకాలు ఇవే!-check out covid19 vaccines which got national regulatory clearance for the children age below 18 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పిల్లల కోసం కోవిడ్19 వ్యాక్సిన్ ఉందా? ఇండియాలో ఆమోదం పొందిన టీకాలు ఇవే!

పిల్లల కోసం కోవిడ్19 వ్యాక్సిన్ ఉందా? ఇండియాలో ఆమోదం పొందిన టీకాలు ఇవే!

Manda Vikas HT Telugu
Jan 24, 2022 09:38 PM IST

ఇప్పటివరకు దేశీయ ఫార్మా సంస్థ జైడస్ కాడిలా హెల్త్‌కేర్ తయారు చేసిన వ్యాక్సిన్ మాత్రమే మన దేశంలో డ్రగ్ రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందింది. 12 ఏళ్లు పైబడిన వయసు వారందరికీ ఈ టీకా సురక్షితమని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

<p>Zycov-D</p>
Zycov-D (Stock Photo)

18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయటానికి సంబంధించి నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ (NEGVAC), నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నాయి.

ఇప్పటివరకు దేశీయ ఫార్మా సంస్థ జైడస్ కాడిలా హెల్త్‌కేర్ తయారు చేసిన ZyCov-D వ్యాక్సిన్ మాత్రమే మన దేశంలో డ్రగ్ రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందింది. 12 ఏళ్లు పైబడిన వయసు వారందరికీ ZyCov-D టీకా సురక్షితమని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.  ఈ ZyCoV-D వ్యాక్సిన్ COVID-19కి వ్యతిరేకంగా మనుషుల కోసం అభివృద్ధిపరిచిన ప్రపంచంలోనే మొట్టమొదటి DNA ప్లాస్మిడ్ టీకా. 

సూదిరహిత టీకా..

సంప్రదాయ టీకా సిరంజిలకు విరుద్ధంగా "ఫార్మాజెట్" అనే సూది రహిత అప్లికేటర్‌ని ఉపయోగించి ZyCov-D వ్యాక్సిన్ అందిస్తారు. సూది-రహిత ఇంట్రాడెర్మల్ వ్యాక్సిన్ కాబట్టి ఈ టీకా తీసుకునేటపుడు ఎలాంటి నొప్పి ఉండదు, తీసుకున్న తర్వాత ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడవని జైడస్ కాడిలా సంస్థ తెలిపింది.

 ZyCoV-D టీకాను మూడు డోసులుగా 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ పరిమితం వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆగస్టు 20న ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) ఇచ్చింది.

పిల్లలకు కోవాగ్జిన్..

భారత్ బయోటిక్ అభివృద్ధి పరిచిన కొవాక్సిన్‌ టీకా ఇప్పటికే 2 నుండి 18 ఏళ్ల వయసు గల వాలంటీర్లపై 2వ, 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. దీనికి సంబంధించిన భద్రత, రోగనిరోధక శక్తి డేటా కూడా జాతీయ నియంత్రణ సంస్థకు సమర్పించింది. కొవాక్సిన్‌ టీకా పిల్లలకు అందించేందుకు ప్రస్తుతానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది.

ఇక, కింది పేర్కొన్న మిగతా కోవిడ్-19 వ్యాక్సిన్‌లు దేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వారికి అందించే దిశగా క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి:

* సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధిపరిచిన నానోపార్టికల్ వ్యాక్సిన్ (లిక్విడ్- కోవోవాక్స్) 2 నుండి 17 సంవత్సరాల వయస్సు వారిపై నిర్వహిస్తున్న 2వ, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

* బయోలాజికల్ ఈ లిమిటెడ్ 5 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 624 మంది వ్యక్తులలో సార్స్ కోవ్-2 జన్యువు ఆర్బిడి 2వ, 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.

* జాన్సన్ & జాన్సన్ ప్రై. లిమిటెడ్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా 12 నుంచి 17 ఏళ్ల పిల్లలపై తమ వ్యాక్సిన్ యొక్క 2వ, 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.

పైన పేర్కొన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌ల క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతం అయితే వాటి డేటాను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలించి, అన్ని ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని భావించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని అప్పటి పరిస్థితి తీవ్రత ఆధారంగా, అవసరాల మేరకు ఆయా వ్యాక్సిన్‌లను అత్యవసర వినియోగానికి ఆమోదించే అవకాశం ఉంటుంది.

|#+|

Whats_app_banner

సంబంధిత కథనం