Woman kills own child : పుట్టిన కొన్ని క్షణాల్లోనే.. బిడ్డను చంపేసిన తల్లి!
Woman kills own child : కడుపులో బిడ్డ ఉందన్న విషయం ఆ మహిళకు తెలియదట! చివరికి.. బిడ్డ పుట్టిన కొన్ని క్షణాల్లోనే చంపేసింది. ఈ ఘటన కోల్‌కతాలో కలకలం సృష్టించింది.
Woman kills own child : పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన కొన్ని క్షణాల్లోనే.. బిడ్డను చంపేసింది ఓ మహిళ. ఇందుకు ఆమె చెప్పిన కారణం విని పోలీసులే షాక్‌కు గురయ్యారు.
అసలేం జరిగిందంటే..
సంబంధిత మహిళ కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో నివాసముంటోంది. కాగా ఈ నెల 22న ఆమె తన ఇంట్లోని బాత్రూమ్కు వెళ్లింది. అక్కడే ఆమెకు ప్రసవం అయ్యింది. ఆ వెంటనే.. బాత్రూమ్లోని అద్దాలు పగలగొట్టి, అప్పుడే పుట్టిన మగబిడ్డను బయటకు విసిరేసింది. అద్దాలు పగలిన శబ్దం విన్న స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగుడారు. నేల మీద పడి ఉన్న శిశువును చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే శిశువును ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కస్బా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
Mother kills child in Kolkata : ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. సంబంధిత మహిళను విచారించారు. ఆమె చెప్పిన మాటలు విని షాక్‌కు గురయ్యారు.
ఇదీ చదవండి:- Maid kills old woman : పనిమనిషి ఘాతుకం.. ప్రియుడు- దత్తపుత్రుడితో కలిసి వృద్ధురాలి హత్య!
"నేను గర్భవతిని అని నాకు తెలియదు. నాకు పీరియడ్స్ కూడా ప్రతి నెలా రెగ్యులర్‌గానే వస్తున్నాయి. కడుపులో బిడ్డ ఉందన్న విషయం నాకు తెలియదు. ప్రసవం తర్వాత బిడ్డ అరుపులు విని భయపడిపోయాను. అందుకే బయటకు విసిరేశాను," అని ఆ మహిళ తమకు చెప్పినట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
West Bengal crime news : "మేము వెళ్లేసరికి.. ప్రసవం కారణంగా ఆ మహిళ కింది భాగంలో రక్తం కారుతోంది. ఆమెను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఆమె ఆరోగ్యంగానే ఉంది. కానీ ఘటన జరిగిన మరుసటి రోజు.. బిడ్డ మరణించింది," అని ఆ అధికారి వివరించారు.
ఇంట్లో ఎవరికీ తెలియదు..!
ఈ విషయంపై పోలీసులు మహిళ కుటుంబసభ్యులను సైతం ప్రశ్నించారు. ఆమె గర్భవతి అన్న విషయం తమకు కూడా తెలియదని వారందరు చెబుతుండటం గమనార్హం. మద్యానికి బానిసైన మహిళ భర్త కూడా ఇదే విషయం చెప్పాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం