Maid kills old woman : పనిమనిషి ఘాతుకం.. ప్రియుడు- దత్తపుత్రుడితో కలిసి వృద్ధురాలి హత్య!
Maid killed old woman : ప్రియుడు, దత్తపుత్రుడితో కలిసి ఓ మహిళ.. ఓ వృద్ధురాలిని చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృద్ధురాలి ఇంట్లో పనిచేసే ఆ మహిళ.. ఆమె డబ్బుపై కన్నేసి.. ఆ ఇద్దరితో ప్లాన్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడింది!
Maid kills old woman in Maharashtra : మహారాష్ట్రలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముంబైలోని ఓ ప్రాంతంలో ఓ 69ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. తొలుత ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని భావించినా.. అది హత్యేనని పోలీసులు తెలుసుకున్నారు. చివరికి.. ఆ వృద్ధురాలి ఇంట్లో పనిచేసే మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
మేరీ సెలిన్ విల్ఫ్రెడ్ డికోస్టా అనే వృద్ధురాలు.. ముంబై మలాడ్ వెస్ట్ ఒర్లెమ్లోని న్యూ లైఫ్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో నివాసముంటోంది. ఆమె ఇద్దరు కూతుళ్లు కువైట్‌లో స్థిరపడ్డారు. మేరీ.. తన మనవడు, 26ఏళ్ల నీల్ రాయ్బోలేతో కలిసి జీవిస్తోంది.
Maid kills old woman in Malad : కాగా.. గురువారం సాయంత్రం నీల్.. మేరీకి కాల్ చేశాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రెండు, మూడుసార్లు ప్రయత్నించిన తర్వాత.. పొరుగింటి వాళ్లకి కాల్ చేశాడు. వాళ్లు వెళ్లి.. మేరీ ఇంటి తలుపు కొట్టారు. ఎంత కొట్టినా డోర్ తీయకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. మేరీ కోసం వెతికారు. చివరికి షాక్‌కు గురయ్యారు!
ఓ బాత్రూమ్లో బకెట్‌లోని నీళ్లల్లో మేరీ తల ఉండటాన్ని గుర్తించారు. వెంటనే నీల్‌కు ఈ విషయం చెప్పారు. నీల్ ఫోన్ చేయడంతో స్థానిక డాక్టర్.. మేరీ నివాసానికి పరిగెత్తాడు. మేరీని చూసిన డాక్టర్.. ఆమె ప్రాణాలు కోల్పోయిందని ధ్రువీకరించాడు. కొన్ని గంటల తర్వాత మేరీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షతాబ్దీ ఆసుపత్రికి తరలించారు.
Mumbai crime news : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మేరీ ప్రమాదవశాత్తు మరణించి ఉంటుందని భావించారు. కుటుంబసభ్యులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం ఇందుకు ఓ కారణం.
ఆ తర్వాత.. పోలీసులకు మేరీ కుటుంబసభ్యుల నుంచి ఫోన్ వచ్చింది. 'ఇంట్లో రెండు ఫోన్స్, రెండు వాచ్‌లు, ఒక బంగారం గొలుసు కనిపించడం లేదు,' అని వివరించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని అధికారులకు అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే స్థానిక సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించడం మొదలుపెట్టారు. కొంతసేపటికే.. మేరీ హత్యకు గురైందని వారికి తెలిసింది. నిందితులను పోలీసులు గుర్తించారు!
సీసీటీవీ ఫుటేజ్‌లో ఏముంది..?
Old woman killed by maid : మేరీ మరణించిన రోజు.. ఆమె ఇంట్లో పని చేసే ఓ మహిళ.. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఆమె పేరు షబ్నామ్. కొంత సేపటి తర్వాత ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఇంకో వ్యక్తి వారిద్దరిని కలిశాడు. ఆ వ్యక్తి ముఖానికి మాస్కు, తలకి క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. వీరు ముగ్గురు మేరీ ఇంట్లోకి ప్రవేశించారు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షబ్నామ్తో పాటు మొదట వచ్చిన వ్యక్తి షెహ్జాద్లను పోలీసులు విచారించారు. 'మేరీ పిలిస్తేనే మేము వెళ్లాము,' అని వారిద్దరు చెప్పారు. పోలీసులకు వారిద్దరిపై అనుమానం పెరిగింది. అదే సమయంలో.. షెహ్జాద్ను షబ్నామ్ దత్తత తీసుకున్నట్టు పోలీసులకు తెలిసింది. ఈ క్రమంలో మూడో వ్యక్తి గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలీసులకు భయపడిన షబ్నమ్, ఆమె దత్తపుత్రుడు.. నిజం చెప్పేశారు.
డబ్బు కోసం.. చంపేశారు!
Malad crime news latest : మల్వానీలో నివాసముండే షబ్నామ్.. మేరీ ఇంట్లో 1997 నుంచి పని చేస్తోంది. ఆ కుటుంబానికి షబ్నామ్ భోజనం వండేది, బట్టలు ఉతికేది, గిన్నెలు కడిగేది. ఇల్లు ఊడ్చే పనులు చేసేది. మేరీకి మసాజ్ కూడా చేసేది.
కాగా కొంతకాలం క్రితం వాసై ప్రాంతానికి చెందిన మహమ్మద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతను ఓ క్యాబ్ డ్రైవర్. అప్పటికే మహమ్మద్‌కు ఓ కుమారుడు ఉన్నాడు. అతనే షెహ్జాద్! కొంత కాలం తర్వాత షెహ్జాద్ను షబ్నామ్ దత్తత తీసుకుంది.
కువైట్‌లో స్థిరపడ్డ మేరీ కూతుళ్లు తాన్యా, జెస్సికాలు వృద్ధురాలికి తరచూ డబ్బులు పంపిస్తుంటారు. ఇది తెలుసుకున్న షబ్నామ్.. ఆ విషయాన్ని తన ప్రియుడు మహమ్మద్‌కు చెప్పింది. చివరికి.. దత్తపుత్రుడు, ప్రియుడితో కలిసి ఇంట్లోని వస్తువులను దొంగలించాలని ప్లాన్ చేసింది షబ్నామ్.
Maharashtra crime news : ప్లాన్‌లో భాగంగానే గత గురువారం సాయంత్రం, మేరీ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడ్డారు నిందితులు. ఈ క్రమంలో.. దిండు పట్టుకుని మేరీ ముఖంపై పెట్టి, ఊపిరాడనివ్వకుండా చేశాడు మహమ్మద్. మేరీ చనిపోయింది! వృద్ధురాలు ప్రమాదవశాత్తు మరణించిందన్న విధంగా చిత్రీకరించారు.
వృద్ధురాలిని చంపినా.. నిందితుల ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. ఇంట్లో ఉన్న కబోర్డులను వారు తెరవలేకపోయారు. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో ఫోన్లు, గోల్డ్ చెయిన్లు తీసుకుని పారిపోయారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పనిమనిషి షబ్నామ్, ఆమె ప్రియుడు, దత్తపుత్రుడిని శనివారం అరెస్ట్ చేశారు.
సంబంధిత కథనం