Woman axes husband to death: నల్లగా ఉన్నావని వేధిస్తే నరికి చంపేసింది!-chhattisgarh woman axes husband to death over frequent taunts about her dark skin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Axes Husband To Death: నల్లగా ఉన్నావని వేధిస్తే నరికి చంపేసింది!

Woman axes husband to death: నల్లగా ఉన్నావని వేధిస్తే నరికి చంపేసింది!

HT Telugu Desk HT Telugu
Sep 27, 2022 09:04 PM IST

Woman axes husband to death: నల్లగా ఉన్నావని రోజు వెక్కిరిస్తూ, వేధిస్తున్న భర్తకు దారుణమైన శిక్ష విధించింది ఆ భార్య. గొడవ పెట్టుకుని, మళ్లీ నల్లగా ఉన్నావని తిట్టిన భర్తను గొడ్డలితో నరికి చంపేసింది.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

Woman axes husband to death: చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. నల్లగా ఉన్నావని తరచూ వేధిస్తున్న భర్తను ఇంట్లోని గొడ్డలితో నరికి చంపేసింది. అదే కోపంలో అతడి మర్మావయవాలను కూడా కోసేసింది.

Woman axes husband to death: రెండో భార్య

చత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలో ఉన్న అమ్లేశ్వర్ గ్రామంలో ఉండే అనంత్ సోన్వానీ ని ఆయన భార్య సంగీత సోన్వానీ హత్య చేసింది. అనంత్ సోన్వానీకి సంగీత రెండో భార్య. మొదటి భార్య చనిపోయిన తరువాత సంగీతను పెళ్లి చేసుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. భార్యను అందంగా లేవని, నల్లగా ఉన్నావని తరచూ తిడుతుండేవాడు అనంత్ సోన్వానీ. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో, అనంత్ మళ్లీ ఆమె శరీర రంగును తూలనాడాడు . దాంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన సంగీత ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తను నరికేసింది. ఆగ్రహం చల్లారక, అతడి మర్మావయవాలను కూడా నరికేసింది. దాంతో, అనంత్ సోన్వానీ అక్కడికక్కడే చనిపోయాడు.

Woman axes husband to death: పోలీసు కేసు

మర్నాడు ఉదయం రాత్రి వేరే ఎవరో వచ్చి తన భర్తను హతమార్చారని ఇరుగుపొరుగుకు చెప్పింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. అనంతరం, సంగీత సోన్వానీని విచారించగా, అసలు విషయం చెప్పేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Whats_app_banner