viral video : జిమ్‌లో వర్కౌట్స్ ఇరగదీస్తున్న 80ఏళ్ల వృద్ధురాలు.. వీడియో వైరల్!
Old woman gym viral video : ఓ 80ఏళ్ల వృద్ధురాలికి చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో ఆమె వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
Old woman gym viral video : మనలో చాలా మందికి బరువు తగ్గాలని ఉంటుంది. కానీ అందుకు ప్రయత్నమే చేయము. చాలా మందికి హెల్తీ లైఫ్‌స్టైల్ అలవాటు చేసుకోవాలని ఉంటుంది. కొంచెం సేపు నడిస్తేనే అలసిపోతూ ఉంటారు. ‘ఇప్పుడే ఇలా ఉంటే.. 60ఏళ్లు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో?’ అని కొందరు భయపడిపోతూ ఉంటారు. కానీ ఓ 80ఏళ్ల వృద్ధురాలు.. తన బలాన్ని ప్రదర్శిస్తూ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 80ఏళ్ల వయస్సులోనూ.. జిమ్‌లో వర్కౌట్స్ ఇరగదీస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్’ అని నిరూపిస్తోంది ఆ వృద్ధారాలు. ఆమె జిమ్ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
80ఏళ్ల వయస్సులో జిమ్..
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో.. ఓ వృద్ధురాలు కనిపిస్తోంది. వివిధ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. ఆమె పేరు ఎలైన్. అదే జిమ్‌కు వెళ్లే ఓ మహిళ, ఎలైన్ వర్కౌట్స్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘తన ఫిట్నెస్ చూసి షాక్ అయ్యాను,’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
80 year old woman gym viral video : "ఆ వయస్సులో కూడా ఆ రేంజ్లో ఎలా జిమ్ చేస్తున్నారు. మీ సీక్రెట్ ఏంటి?" అని ఎలైన్ ఎలైన్ని అడగ్గా.. ‘రోజు జిమ్‌కి రా’ అని సలహా ఇచ్చింది.
"'జిమ్‌లో కాస్త టైమ్ గడపండి ఉండండి. రెగ్యులర్‌గా జిమ్ చేయండి. బలంగా ఉంటారు," అని ఎలైన్ వీడియోను షేర్ చేసిన మహిళ రాసుకొచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 80ఏళ్ల వృద్ధురాలి జిమ్ వీడియోను ఇక్కడ చూడండి.
ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్స్ వర్షం కురిపించారు. 80ఏళ్లు వృద్ధురాలి సీక్రెట్ తెలుసుకునేందుకు విపరీతంగా కామెంట్స్ చేశారు. అమె కృషిని అనేక మంది అభినందించారు.
Old woman gym workouts : 'నేను అలా ఉండాలనుకుంటున్నాను. ఇది అద్భుతం," అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. "అవును! ముందుకు సాగండి. ఆగకండి," అని మరో వ్యక్తి పేర్కొన్నారు. 'ఆమె చాలా అద్భుతంగా ఉంది' అని మూడో నెటిజన్ రాశారు. 'మీరు యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. నిరంతర కృషికి అభినందనలు,' అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏమిటి? మీరేం అంటారు?
సంబంధిత కథనం