DMK vs Governor : ‘గవర్నర్​ను చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా..’-will send terrorist to kill tamil nadu governor says dmk leader bjp demands arrest ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dmk Vs Governor : ‘గవర్నర్​ను చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా..’

DMK vs Governor : ‘గవర్నర్​ను చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా..’

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 14, 2023 08:56 AM IST

DMK vs Governor : డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి.. గవర్నర్​ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నర్​ను చంపేందుకు ఉగ్రవాదిని పంపిస్తా’ అని వ్యాఖ్యానించారు.

గవర్నర్​పై డీఎంకే ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు..
గవర్నర్​పై డీఎంకే ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. (ANI)

DMK vs Governor : తమిళనాడు గవర్నర్​ ఆర్​ఎన్​ రవి- డీఎంకే మధ్య వివాదం మరింత ముదిరింది! గవర్నర్​పై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి. 'తమిళనాడు గవర్నర్​ను హత్య చేసేందుకు ఉగ్రవాదిని పంపిస్తా,' అని అన్నారు.

‘కశ్మీర్​కు వెళ్లిపోవాలి..’

తమిళనాడులో ఇటీవలే ఓ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న శివాజీ కృష్ణమూర్తి.. గవర్నర్​కు వ్యతిరేకంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్​ పేరు ఎత్తడం ఇష్టం లేకపోతే.. కశ్మీర్​కు వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.

Tamil Nadu Governor RN Ravi latest news : "గవర్నర్​ను తిట్టొద్దని సీఎం చెబుతున్నారు. అసెంబ్లీలో సరిగ్గా ప్రసంగం చేసి ఉంటే.. నేను గవర్నర్​ కాళ్ల వద్ద పువ్వులు వేసేవాడిని. చేతులు జోడించి దండం పెట్టేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. అంబేడ్కర్​ పేరును చెప్పేందుకు ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తిని చెప్పుతో కొట్టే హక్కు నాకు లేదా? అంబేడ్కర్​ పేరును ప్రస్తావించడం ఇష్టం లేకపోతే.. కశ్మీర్​కు వెళ్లిపోండి. గవర్నర్​ను కాల్చి చంపేందుకు అక్కడికి ఉగ్రవాదిని పంపిస్తా," అని మండిపడ్డారు శివాజీ కృష్ణమూర్తి.

తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన బీజేపీ..

గవర్నర్​ ఆర్​ఎన్​ రవిపై డీఎంకే ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు. డీఎంకేకు ఉగ్రవాదులతో లింక్​ ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.

Tamil Nadu CM MK Stalin : "గవ్నరర్​ను కశ్మీర్​కు పంపిస్తానని, అక్కడికి ఉగ్రవాదులను పంపించి హత్య చేయిస్తానని డీఎంకే ప్రతినిధి అంటున్నారు. డీఎంకేకు ఉగ్రవాదులతో లింక్​ ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేపట్టాలి. చాలా నిచమైన పదజాలంతో గవర్నర్​ను వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. ఇవన్నీ.. సీఎం ఎంకే స్టాలిన్​ ఆశిస్సులతోనే జరుగుతున్నట్టు అనిపిస్తోంది," అని బీజేపీ నేత నారాయణ్​ తిరుపతి మండిపడ్డారు.

డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తితో పాటు మరో నాయకుడు ఆర్​ఎస్​ భారతీని.. గూండా చట్టం కింద అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు నారాయణ్​ తిరుపతి.

"తమిళనాడు పోలీసులకు ధైర్యం ఉంటే.. డీఎంకే నేతలను అరెస్ట్​ చేయాలి. గూండా చట్టం కింద వారిద్దరిని ఏడాది పాటు జైలులో పెట్టాలి," అని డిమాండ్​ చేశారు బీజేపీ నేత.

ఇదీ వివాదం..

MK Stalin vs RN Ravi : ఈ నెల 9న.. అసెంబ్లీలో తమిళనాడు గవర్నర్​ చేసిన ప్రసంగం వార్తలకెక్కింది. ప్రసంగంలో కొంత భాగాన్ని పక్కనపెట్టినట్టు, పేపర్లలో లేనివి కూడా ప్రస్తావించినట్టు డీఎంకే ఆరోపించింది. ఆయనకు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్​ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పరిణామాల మధ్య ఆర్​ఎన్​ రవి.. సభ నుంచి వాకౌట్​ చేశారు. ఆ తర్వాత డీఎంకే- బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Whats_app_banner

సంబంధిత కథనం