IMD rain alert : ఇంకొన్ని రోజుల పాటు దిల్లీలో భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాల్లో కూడా!-weather updates delhi to receive very heavy rainfall till july 1 says imd ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Rain Alert : ఇంకొన్ని రోజుల పాటు దిల్లీలో భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాల్లో కూడా!

IMD rain alert : ఇంకొన్ని రోజుల పాటు దిల్లీలో భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాల్లో కూడా!

Sharath Chitturi HT Telugu
Jun 29, 2024 08:14 AM IST

దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన వివరాలను ఐఎండీ వెల్లడించింది.

దిల్లీ వర్షాలకు ప్రజలు ఇలా..
దిల్లీ వర్షాలకు ప్రజలు ఇలా.. (ANI)

భానుడి భగభగలకు ఇన్ని రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి అయిన దిల్లీలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే జూలై 1 వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. భారత దేశంలోని అనేక ప్రాంతాలకు వర్ష సూచన ఇచ్చింది.

“హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్​లో జూన్ 29, 30 తేదీలలో వర్షాలు పడతాయి. పంజాబ్​లో జూన్ 30, జూలై 1 న భారీ వర్షపాతాన్ని ఆశించవచ్చు. హరియాణా, ఛండీగఢ్, దిల్లీలో జూన్ 29 నుంచి జూలై 1 వరకు భారీ వర్షాలు కురుస్తాయి,” అని ఐఎండీ తెలిపింది.

ఉత్తర్​ప్రదేశ్​లో జూన్ 28 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు రాజస్థాన్ జూన్ 29 నుంచి జూలై 2 వరకు ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగవచ్చని, మధ్యప్రదేశ్​లో జూన్ 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనికి తోడు ఈ నెల 30 వరకు ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

రానున్న ఐదు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో ఇలా..

కేరళ- మాహే, లక్షద్వీప్, కర్ణాటక కోస్తా ప్రాంతం, విదర్భ, ఛత్తీస్​గఢ్​, కొంకణ్- గోవా, గుజరాత్ , మధ్య మహారాష్ట్రలో ఉరుములు, మెరుపులతో విస్తృతమైన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాన్ని ఆశించవచ్చు.

మరాఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, ఉత్తర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఛత్తీస్​గఢ్​లో 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, 28న విదర్భ, సౌరాష్ట్ర అండ్ కచ్, కేరళ- మాహే, 29, 30 జూన్, జూలై 2 తేదీల్లో గుజరాత్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈశాన్య భారతంలో..

పశ్చిమ బెంగాల్ హిమాలయ ప్రాంతం, సిక్కింలో శనివారం ఉరుములు, మెరుపులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అరుణాచల్​ ప్రదేశ్​లో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని, అసోంస మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వచ్చే ఐదు రోజుల్లో ఈ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.

28, 30 తేదీల్లో పశ్చిమ బెంగాల్​లోని హిమాలయ ప్రాంతం, సిక్కింలో, జూన్ 30 నుంచి జూలై 2 వరకు అరుణాచల్ ప్రదేశ్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం