IRCTC Karnataka Tour : కర్ణాటకలోని 5 పుణ్యక్షేత్రాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే!
IRCTC Karnataka Tour : హైదరాబాద్ నుంచి కర్ణాటక ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో కర్ణాటకలోని ధర్మస్థల, మంగుళూరు, శృంగేరి, ఉడిపి, కుక్కే సుబ్రమణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
IRCTC Karnataka Tour : కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల సందర్శనకు డివైన్ కర్ణాటక పేరుతో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 6 రోజుల పాటు కర్ణాటకలోని ధర్మస్థల, మంగుళూరు, శృంగేరి, ఉడిపి, కుక్కే సుబ్రమణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది.
ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్: (1 నుంచి 3 మంది)
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు) |
కంఫర్ట్(3A) | రూ.37350 | రూ.21920 | రూ.17690 | రూ.10220 | రూ.9110 |
స్టాండర్ట్(SL) | రూ.34360 | రూ.18920 | రూ.14700 | రూ.7230 | రూ.6110 |
ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్: (4 నుంచి 6 మంది)
క్లాస్ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 Years) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 years) |
కంఫర్ట్(3A) | రూ.18890 | రూ.16800 | రూ.11190 | రూ.9800 |
స్టాండర్డ్(SL) | రూ.15890 | రూ.13800 | రూ.8200 | రూ.6800 |
పర్యటన ఇలా : ఉడిపి - శృంగేరి - ధర్మస్థల - కుక్కే - మంగళూరు (05 రాత్రులు / 06 రోజులు)
- డే 01 : మంగళవారం
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(నెంబర్ 12789) బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ చేస్తారు.
- డే 02 : బుధవారం
ఉదయం 09:30 గంటలకు రైలు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. రైల్వే స్టేషన్ లో పర్యాటకులను పికప్ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. అనంతరం శ్రీ కృష్ణ దేవాలయం, మల్పే బీచ్ సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలో బస చేస్తారు.
- డే 03 : గురువారం
హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి శృంగేరికి బయలుదేరతారు. శృంగేరి శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత మంగుళూరు బయలుదేరివెళ్తారు. మంగుళూరు చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. మంగుళూరులో రాత్రి బస చేస్తారు.
- డే 04 : శుక్రవారం
ఉదయం మంజునాథ ఆలయాన్ని సందర్శించేందుకు ధర్మస్థలానికి బయలుదేరతారు. అనంతరం కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి మంగుళూరు చేరుకుని రాత్రి బస చేస్తారు.
- డే 05 : శనివారం
మంగుళూరులోని స్థానిక దేవాలయాలు మంగళ దేవి ఆలయం, కద్రి మంజునాథ దేవాలయం సందర్శిస్తారు. స్థానికంగా షాపింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7:00 గంటలకు మంగుళూరు సెంట్రల్ రైల్వేస్టేషన్ లో డ్రాప్ చేస్తారు. రైలు నం. 12790లో తిరిగి హైదరాబాద్ కు రాత్రి 08:05 గంటలకు బయలుదేరతారు. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
- డే 06 : ఆదివారం
రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.
డివైన్ కర్ణాటక ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలను కింద లింక్ లో చెక్ చేయండి.