Man rides cycle with 9 children : తొమ్మిది మంది పిల్లలతో సైకిల్​ సవారీ..!-viral video of man riding bicycle with nine children internet in splits ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Viral Video Of Man Riding Bicycle With Nine Children, Internet In Splits

Man rides cycle with 9 children : తొమ్మిది మంది పిల్లలతో సైకిల్​ సవారీ..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 20, 2022 12:06 PM IST

Man rides cycle with 9 children : ఓ వ్యక్తి.. తొమ్మిది మంది పిల్లలతో సైకిల్​ సవారీ చేసిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

తొమ్మిది మంది పిల్లలతో సైకిల్​ సవారీ..
తొమ్మిది మంది పిల్లలతో సైకిల్​ సవారీ.. (twitter)

Man rides cycle with 9 children : ఒక సైకిల్​ మీద ఎంత మంది ఎక్కగలరు? ఒకరు.. మహా అయితే ఇద్దరు! కానీ.. మొత్తం 10మంది సైకిల్​లో సవారీకి వెళితే! ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఓ వ్యక్తి.. తొమ్మిది మంది పిల్లలను సైకిల్​ మీద ఎక్కించుకుని వెళుతున్న దృశ్యాలు చూసి నెటిజన్లు షాక్​ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఎలా సాధ్యం..?

ట్విట్టర్​లో జైకీ యాదవ్​ అనే వ్యక్తి.. ఈ వీడియోను ట్వీట్​ చేశాడు. అందులో.. ఓ వ్యక్తి సైకిల్​ తొక్కుతూ కనిపించాడు. సైకిల్​ వెనుక ఇద్దరు కూర్చిని ఉన్నారు. వారిలో ఒకరి మీద.. మరో చిన్నారి నిలబడి ఉంది. కింద పడిపోకుండా.. ఆ చిన్నారి అతని భుజాలను పట్టుకుంది. ఇక సైకిల్​ ముందు భాగంలోని రాడ్​ మీద మరో ఇద్దరు పిల్లలు కూర్చుని కనిపించారు. ఫ్రంట్​ వీల్​ మీద మరో చిన్నారి కూర్చుంది. మిగిలిన ఇద్దరు.. ఆ వ్యక్తి భుజాల మీద ఎక్కి కూర్చున్నారు.

Latest viral video : అంటే.. మొత్తం 10మంది ఆ సైకిల్​ మీద ఉన్నట్టు! ఇది చాలా సింపుల్​ విషయం అన్నట్టుగా.. ఆ వ్యక్తి సైకిల్​ నడపడటం ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం.

"ప్రపంచ జనాభా 800కోట్లకు చేరింది. ఈ ఘనత సాధించడంలో ఇలాంటి వారి పాత్ర చాలా ఎక్కువే ఉంది," అని సెటైర్​ వేశాడు జైకీ యాదవ్​.

ఈ వీడియో ఎక్కడిది అన్నది తెలియలేదు. కానీ చూస్తుంటే.. ఆఫ్రికా ప్రాంతంలో తీసినట్టు కనిపిస్తోంది. ఈ నెల 15న షేర్​ చేసిన ఈ వీడియోకు ఇప్పటికి 2లక్షలకుపైగా వ్యూస్​, 7200 లైక్స్​ వచ్చాయి.

Man rides cycle viral video : కొందరు.. జనాభాపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఆ వ్యక్తికి మద్దతుగా నిలుస్తున్నారు.

"ప్రతి విషయాన్ని తప్పుగా ఆలోచించకూడదు. ఆ పిల్లలు అందరు అతని సంతానం కాకపోవచ్చు. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చుండొచ్చు," అని ఓ నెటిజన్​ రాసుకొచ్చాడు.

"ఆ మనుషుల కన్నా.. సైకిల్​, టైర్​ కంపెనీ మీద నాకు ఆసక్తి పెరుగుతోంది. చాలా ధృడంగా ఉన్నాయి," అని మరో నెటిజన్​ ఫన్నీ కామెంట్​ పెట్టాడు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం