Viral News : గుండెలోని 4 గదులకు అమ్మాయిల పేర్లు.. ఈ స్టూడెంట్ చాలా నిజాయితీపరుడు!-viral news student personalises heart diagram with girls names netizens cant keep calm with viral diagram ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral News : గుండెలోని 4 గదులకు అమ్మాయిల పేర్లు.. ఈ స్టూడెంట్ చాలా నిజాయితీపరుడు!

Viral News : గుండెలోని 4 గదులకు అమ్మాయిల పేర్లు.. ఈ స్టూడెంట్ చాలా నిజాయితీపరుడు!

Anand Sai HT Telugu
Jun 27, 2024 03:37 PM IST

Viral News : ఓ విద్యార్థి చేసిన పని నెటిజన్లకు నవ్వు తెప్పించింది. గుండె బొమ్మను గీయమని చెబితే.. ఏకంగా అందులో అమ్మాయిల పేర్లను కూడా రాసేశాడు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

గుండె గదులకు అమ్మాయిల పేర్లు
గుండె గదులకు అమ్మాయిల పేర్లు

ఓ స్టూడెంట్ గీసిన గుండె పటం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికి అతడు హృదయాన్ని బాగా గీశాడు. కానీ అతడు చేసిన పని మాత్రం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. ఎందుకంటే గుండె బొమ్మను గీసి అందులో అమ్మాయిల పేర్లు రాశాడు. గుండెలోని నాలుగు గదులను నలుగురి అమ్మాయిలకు రాసిచ్చేశాడు. అంతేకాదు మధ్యలో మరో గీతలో ఇంకో అమ్మాయి పేరు రాశాడు. మెుత్తం ఐదుగురి అమ్మాయిల పేర్లను రాసిన ఈ గుండె పటం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

నిజానికి మనలో చాలా మందికి పాఠశాలలో గుండె బొమ్మ గీయడం కష్టం. ఒకవేళ దానితోపాటుగా వేరే ఏదైనా ఆప్షన్ ఇస్తే.. పరీక్షలో ఇతర ప్రశ్నలకే ప్రయత్నిస్తాం. కానీ ఒక విద్యార్థి మాత్రం గుండె బొమ్మను చక్కగా గీసి అందులో అమ్మాయిల పేర్లు రాశాడు. దీనికి సంబంధించిన బొమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తోంది.. చాలా మంది నెటిజన్లు ఇది చూసి నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో విద్యార్థి గుండెలోని గదులకు పేర్లు పెట్టే బదులుగా హరిత, ప్రియ, పూజ, నమిత, రూప అనే అమ్మాయిల పేర్లను రాశాడు. ఈ విద్యార్థి అక్కడితో ఆగలేదు సరికదా.. అమ్మాయిలకు సంబంధించి గుండె విధులను వివరించాడు.

ప్రియ గురించి వివరణ రాస్తూ.. ఆమె ఎప్పుడూ నాతో చాటింగ్ చేస్తుంది. ఆమె అంటే నాకు ఇష్ట అని రాశాడు.

రూపా అనే అమ్మాయి నాతో స్నాప్‌చాట్‌లో చాట్ చేస్తుందని, చాలా అందమైన అమ్మాయిని పొగిడాడు.

నమిత పొడవాటి జుట్టు, పెద్ద కళ్ళు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఆమె తన ఇంటి పక్కన ఉంటుందని తెలిపాడు. అతని హృదయంలో ఆమెకు కూడా స్థానం ఇచ్చాడు.

నమిత అనే అమ్మాయి అతడి క్లాస్‌మేట్ అని చెప్పుకొచ్చాడు.

తన మాజీ ప్రేమికురాలు పూజ అని ఆమెను మరిచిపోలేకపోతున్నట్టుగా రాసుకొచ్చాడు.

ఈ ఫొటో మే 13న షేర్ అయింది. దీనికి మిలియన్లకు పైగా వ్యూస్ వస్తున్నాయి. ఒక మిలియన్ కంటే ఎక్కువ లైక్‌లతో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ పోస్ట్ కింద ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'కనీసం గుండెకు నాలుగు గదులు ఉన్నాయని అతనికి తెలుసు..' అని ఒక వ్యక్తి రాశాడు. 'బ్రో తన మాజీని మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు.' అని మరొకరు కామెంట్ చేశారు.

విద్యార్థి దెబ్బకు టీచర్ షాక్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ గుండె బొమ్మ వైరల్‌గా మారింది. చాలా మంది ఈ పోస్ట్ చూసి నవ్వుకుంటున్నారు.

WhatsApp channel