Cow roams inside hospital ICU: హాస్పిటల్ ఐసీయూలో హాయిగా విహరిస్తున్న ఆవు
Cow roams inside hospital ICU: మధ్య ప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఒక ఆవు తిరుగుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆసుపత్రి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి.
Cow roams inside hospital ICU: మధ్య ప్రదేశ్ లోని రాజ గఢ్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహణ లోపాలను ఎత్తిచేపే వీడియో ఇది. రాజగఢ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆవు స్వేచ్ఛగా తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది.
Cow roams inside hospital ICU: 30 సెకండ్ల వీడియో
ఒక ఆవు హాస్పిటల్ లోని ఐసీయూలో, కారిడార్లో తిరుగుతున్న దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీశాడు.అప్పుడు ఆ ఐసీయూలో కొందరు పేషెంట్లు కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్ కానీ, వార్డు బోయ్ కాని లేరు. ఆ ఆవును అక్కడి పేషెంట్లకు సంబంధించిన ఒక వ్యక్తి బయటకు పంపించాడు. అక్కడ యథేచ్చగా తిరగడంతో పాటు అక్కడి డస్ట్ బిన్ లలో ఉన్న మెడికల్ వ్యర్థాలను ఆ ఆవు తింటుండడం కూడా వీడియోలో రికార్డయింది.
Cow roams inside hospital ICU: ప్రత్యేక సిబ్బంది
ఆవులు, ఇతర పశువులు ఆసుపత్రి లోకి రాకుండా చూసేందుకు ఇద్దరు ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించామని, అయితే, ఆ ఆవు వచ్చిన సమయంలో వారు అక్కడ లేరని హాస్పిటల్ సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకోనున్నామన్నారు. ఈ హాస్పిటల్ పట్టణానికి దూరంగా ఉండడంతో ఇక్కడ పశువుల బెడద అధికంగా ఉందన్నారు. అనంతరం, ఒక సెక్యూరిటీ గార్డ్, ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ ఆవు వెళ్లింది పాత కవిడ్ ఐసీయూ అని వివరించారు.
Cow roams inside hospital ICU: గతంలో కూడా ఒకసారి
ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో గతంలో కూడా ఒకటి జరిగింది. రత్లాం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల బెడ్ పై ఒక కుక్క పడుకుని ఉన్న వీడియో సెప్టెంబర్ నెలలో వైరల్ అయింది. ఆ వీడియోను చూపిస్తూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఇలా ఉందంటూ ఎద్దేవా చేసింది.