Gyanvapi Mosque: ‘‘జ్ఞాన్ వాపీ మసీదు దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు’’- వారణాసి కోర్టు-varanasi court allows hindu side to pray in southern cellar of gyanvapi mosque ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gyanvapi Mosque: ‘‘జ్ఞాన్ వాపీ మసీదు దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు’’- వారణాసి కోర్టు

Gyanvapi Mosque: ‘‘జ్ఞాన్ వాపీ మసీదు దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు’’- వారణాసి కోర్టు

HT Telugu Desk HT Telugu
Jan 31, 2024 03:57 PM IST

Gyanvapi Mosque: జ్ఞాన వాపీ మసీదు దక్షిణ భాగంలోని సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు అనుమతినిచ్చింది.

జ్ఞాన వాపీ మసీదు
జ్ఞాన వాపీ మసీదు

జ్ఞాన వాపి మసీదు దక్షిణ సెల్లార్లో ప్రార్థనలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు బుధవారం హిందూ పక్షానికి అనుమతి ఇచ్చింది. అక్కడ పూజలు నిర్వహించడానికి శ్రీ కాశీవిశ్వనాథ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారికి అవకాశం కల్పించాలని కోర్టు రిసీవర్ ను ఆదేశించింది.

మరో వారం రోజుల్లో

జ్ఞాన్ వాపి మసీదు (Gyanvapi Mosque) దక్షిణ భాగంలోని సెల్లార్ లో మరో వారం రోజుల్లో పూజలను ప్రారంభిస్తామని హిందూ పక్షం తరఫున వాదించే న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెలల్డించారు. ఇష్ట దైవానికి పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. కాగా, ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు. పిటిషన్ ను కొట్టివేయాలని మసీదు కమిటీ చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో పిటిషన్

జ్ఞాన వాపి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఒక పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదిక నిర్ధారించిన విషయం తెలిసిందే. కాగా, మసీదు లో సీల్ చేసి ఉన్న ప్రాంతాన్ని కూడా తవ్వి, సంపూర్ణంగా మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు సుప్రీంకోర్టును మంగళవారం ఆశ్రయించారు. గతంలో అక్కడ శివలింగం ఉందని, అందువల్ల ఆ శివలింగానికి ఎలాంటి నష్టం కలిగించకుండా, ఆ శివలింగం చుట్టూ నిర్మించిన కృత్రిమ / ఆధునిక గోడలు / అంతస్తులను తొలగించాలని వారు సుప్రీంకోర్టును కోరారు. అలాగే, అక్కడ లభించిన శివలింగం స్వభావాన్ని, చరిత్రను నిర్ణయించడానికి శివలింగం చుట్టూ ఏఎస్ఐ శాస్త్రీయ పద్ధతుల్లో అవసరమైన తవ్వకాలు చేపట్టాలని వారు కోరారు. ఆ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే వారణాసి జిల్లా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Whats_app_banner