Owaisi on Gyanvapi Masjid case : ‘జ్ఞాన్​వాపి.. మరో బాబ్రీ మసీదు అవుతుంది!’-asaduddin owaisi comments on gyanvapi masjid case order ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /   Asaduddin Owaisi Comments On Gyanvapi Masjid Case Order

Owaisi on Gyanvapi Masjid case : ‘జ్ఞాన్​వాపి.. మరో బాబ్రీ మసీదు అవుతుంది!’

HT News Desk HT Telugu
Sep 12, 2022 10:10 PM IST

Owaisi on Gyanvapi Masjid case : జ్ఞాన్​వాపి మసీదు వ్యవహారంపై జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు అసదుద్దీన్​ ఓవైసీ. ఈ వ్యవహారం మరో బాబ్రీ మసీదు అవుతుందని వ్యాఖ్యానించారు.

అసదుద్దీన్​ ఓవైసీ
అసదుద్దీన్​ ఓవైసీ (ANI)

Owaisi on Gyanvapi Masjid case : జ్ఞాన్​వాపి మసీదు వ్యవహారంలో ఉత్తర్​ప్రదేశ్​ జిల్లా కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. కోర్టు ఆదేశాలతో అస్థిరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. జ్ఞాన్​వాపి వ్యవహారం.. మరో బాబ్రీ మసీదుగా మారుతున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఈ ఆదేశాలతో.. 1991 ప్లేసెస్​ ఆఫ్​ వర్షిప్​ యాక్ట్​కు అర్థం లేకుంటా పోయిందని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

జ్ఞాన్​వాపి మసీదు కేసుపై కోర్టు ఆదేశాల విషయం గురించి హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు అసదుద్దీన్​ ఓవైసీ. బాబ్రీ మసీదు తీర్పు వెలువడినప్పుడు.. సమస్యలు తప్పవని తాను హెచ్చరించినట్టు గుర్తుచేశారు ఓవైసీ.

"ఈ ఆదేశాల అనంతరం దేశంలో అస్థిరతతో కూడిన పరిణామాలు మొదలవుతాయి. బాబ్రీ మసీదు సమస్యలో జరిగిందే.. ఇక్కడా జరిగేడట్టు కనిపిస్తోంది," అని ఓవైసీ అన్నారు.

"జిల్లా కోర్డు ఆదేశాలను హైకోర్టులో అప్పీలు చేయాలి. అంజుమన్​ ఇంతజామియా మసిద్​ కమిటీ.. హైకోర్టుకు వెళుతుందని నేను ఆశిస్తున్నాను. లేకపోతే.. 1991 ప్లేసెస్​ ఆఫ్​ పీపుల్స్​ వర్షిప్​ యాక్ట్​ పనికిరాకుండా పోతుంది," అని అభిప్రాయపడ్డారు అసదుద్దీన్​ ఓవైసీ.

Gyanvapi masjid case update : జ్ఞాన్‌వాపి మసీదులో రోజూ హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి ఇవ్వాలన్న హిందూ ఆరాధకుల అభ్యర్థనను సవాలు చేస్తూ అంజుమన్ కమిటీ వేసిన పిటిషన్‌ను వారణాసిలోని జిల్లా కోర్టు సోమవారం తిరస్కరించింది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, వాటిని పూజించేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అంజుమన్ కమిటీ సవాలు చేసింది.

జ్ఞాన్‌వాపి మసీదు- శృంగార్ గౌరీ వివాద కేసులో జిల్లా జడ్జి ఎ.కె.విశ్వేష్‌తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది.

మతపరమైన సున్నితమైన ఈ అంశంలో జిల్లా న్యాయమూర్తి గత నెలలో ఉత్తర్వులను రిజర్వ్ చేసి ఈరోజు వెలువరించారు. తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం