Nurse raped : నిన్న వైద్యురాలు.. నేడు నర్స్​.. హాస్పిటల్​ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా రేప్​ చేసి చంపేసి..!-uttarakhand nurse raped murdered while returning from hospital ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nurse Raped : నిన్న వైద్యురాలు.. నేడు నర్స్​.. హాస్పిటల్​ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా రేప్​ చేసి చంపేసి..!

Nurse raped : నిన్న వైద్యురాలు.. నేడు నర్స్​.. హాస్పిటల్​ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా రేప్​ చేసి చంపేసి..!

Sharath Chitturi HT Telugu
Aug 16, 2024 05:42 AM IST

Uttarakhand nurse raped : ఉత్తరాఖండ్​లో పని చేసే ఓ నర్స్​ రేప్​నకు గురైంది. అనంతరం నిందితుడు ఆమెను హత్య చేసి చంపేశాడు! ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్​కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ వార్త మహిళల భద్రతపై మరింత ఆందోళనలు రేకెత్తిస్తోంది.

కోల్​కతాలో వైద్యురాలి హత్యాచారంపై నిరసనలు..
కోల్​కతాలో వైద్యురాలి హత్యాచారంపై నిరసనలు.. (AFP)

కోల్​కతా వైద్యురాలి రేప్​, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఉత్తరాఖండ్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్​ ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న నర్స్​ రేప్​తో పాటు దారుణ హత్యకు గురైంది!

ఇదీ జరిగింది..

ఉత్తరాఖండ్​లోని ఉత్తర్​ ప్రదేశ్​ సరిహద్దు ప్రాంత​లో జులై 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 30వ తేదీ సాయంత్రం, ఆ నర్స్ రుద్రపూర్​లోని ఇంద్రా చౌక్​ వద్ద ఉన్న ఆసుపత్రి నుంచి ఆటోరిక్షా ఎక్కి ఇంటికి బయలుదేరింది. యూపీ బిలాస్​పూర్​లోని ఆమె ఉండే కాశీపూర్​ రోడ్డుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆమె ఎప్పుడూ ఇంటికి చేరుకోలేదు!

మహిళకు ఒక 11ఏళ్ల కూతురు ఉంది. ఇద్దరు కలిసి నివాసముంటున్నారు. మహిళ ఇంటికి రాకపోవడంతో ఆమె కూతురు ఆందోళనకు గురైంది.

మరుసటి రోజు, నర్స్​ సోదరి పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కంప్లెయింట్​ ఇచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం దక్కలేదు. చివరికి, 8 రోజుల తర్వాత అంటే ఆగస్ట్​ 8న నర్స్​ మృతదేహం, నర్స్​ ఇంటికి 1.5 కి.మీల దూరంలోని ఓ ఖాళీ స్థాలంలో కనిపించింది.

ఇదీ చూడండి:- Kolkata doctor rape and murder: హత్యాచారానికి ముందు కోల్ కతా డాక్టర్ తన డైరీలో ఏం రాసిందో చూస్తే కన్నీళ్లు ఆగవు..

పోలీసులు నర్స్​ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు టీమ్​ని ఏర్పాటు చేశారు. స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మహిళ ఫోన్​ కనిపించడం లేదని గుర్తించి, దానిని ట్రేస్​ చేసేందుకు ప్రయత్నించారు. అది నిందితుడు ధర్మేంద్ర దగ్గరికి తీసుకెళ్లింది!

ధర్మేంద్ర ఒక రోజువారీ కూలి. యూపీలోని బరేలీకి చెందిన వాడు. అతడిని బుధవారం రాజస్థాన్​లో పోలీసులు అరెస్ట్​ చేశారు.

మద్యం మత్తులో ఉన్న నిందితుడు, ఒంటరిగా ఉన్న నర్స్​ని చూశాడు. ఆమెను ఫాలో అయ్యాడు. తన నివాసంలోకి వెళుతుండగా, ఆమెపై దాడి చేశాడు. సమీపంలోని పొదొల్లోకి ఈడ్చుకెళ్లి రేప్​ చేశారు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ వివరాలను ఉధమ్​ సింగ్​ నగర్​ ఎస్​పీ మంజునాథ్​ టీసీ తెలిపారు.

నర్స్​ని చంపిన అనంతరం ఆమె ఫోన్​ని, ఆమె పర్స్​లో నుంచి రూ. 3వేలను దొంగలించాడు. ఓ ఖాళీ ప్రాంతంలో మృతేహాన్ని పడేశాసి పారిపోయాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీనిస్తున్నారు.

కోల్​కతా వైద్యురాలి రేప్​, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం మహిళల భద్రతా ఆందోళనలను మరింత పెంచింది. కోల్​కతా ఆర్​జీ కార్​ వైద్య కళాశాలో డ్యూటీ చేస్తున్న 31ఏళ్ల వైద్యురాలి మృతదేహం అర్ధనగ్నంగా, సెమినార్​ హాల్​లో కనిపించింది. ఇది కలకలం సృష్టించింది. వైద్యురాలి మృతికి న్యాయం జరగాలని, వైద్యులకు రక్షణ కావాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

సంబంధిత కథనం