Same-Sex Marriage: ‘స్వలింగ సంపర్కుల వివాహ’ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
Same-Sex Marriage: సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుకు అమెరికాలో తొలి అడుగుపడింది. దీన్ని సెనేట్ ఆమోదించింది.
Same-Sex Marriage: అమెరికా సెనేట్ ఓ కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది. స్వలింగ సంపర్క వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (Same-sex marriage Protection bill)ను ఆమోదించింది. సేమ్-సెక్స్ మ్యారేజ్‍లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళనతో.. అమెరికన్ సెనేట్ ఈ బిల్లును ఆమోదించింది. అధికార డెమోక్రాట్ పార్టీతో పాటు కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో సులువుగా గ్రీన్ సిగ్నల్ లభించింది.
లవ్ ఈజ్ లవ్: అమెరికా అధ్యక్షుడు బైడెన్
Same-sex marriage Protection bill: స్వలింగ సంపర్క వివాహ రక్షణ బిల్లు సెనేట్‍లో ఆమోదం పొందటంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంతోషం వ్యక్తం చేశారు. “రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్.. ద్వైపాక్షిక సెనేట్‍లో ఆమోదం పొందింది. ప్రేమ ఎవరిదైనా ప్రేమే (Love is Love) అనే ప్రాథమిక నిజాన్ని చాటిచెప్పేందుకు అమెరికా సమీపంలో ఉంది. ఇష్టపడే వారిని విహహం చేసుకునే హక్కు అమెరికన్లకు ఉండాలి” అని బైడెన్ చెప్పారు. సెనేట్‍లో ఈ సేమ్ సెక్స్ ప్రొటెక్షన్ బిల్ 61-36 ఓట్లతో ఆమోదం పొందింది. అధికార డెమోక్రాట్లతో పాటు 11 మంది రిపబ్లికన్లు కూడా సెనెనేట్‍లో మద్దతు తెలిపారు. దీంతో చట్ట రూపకల్పనకు తొలి అడుగుపడింది.
ప్రతినిధుల సభకు..
Same-sex marriage Protection bill: సెనేట్‍లో ఆమోదం పొందిన స్వలింగ వివాహ రక్షణ బిల్లు ఆ తర్వాత ప్రతినిధుల సభ (House of Representatives)కు చేరుతుంది. అక్కడ కూడా ఈ చట్టానికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ సభలో ఆమోదం పొందాక.. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్‍కు చేరుతుంది. ఆయన అంగీకారంతో చట్టం కార్యరూపంలోకి వస్తుంది.
దశాబ్దాలుగా..
Same-sex marriages: అమెరికాలో ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ సమస్య దశాబ్దాలుగా ఉంది. ఎల్‍జీబీటీక్యూ (LGBTQ)కమ్యూనిటీకి చెందిన వారు పోరాడుతూనే ఉన్నారు. ఇదో విభజన సమస్యగా అక్కడ తలెత్తింది. “ఎల్‍జీబీటీక్యూ అమెరికన్లకు న్యాయం దక్కే దిశగా ఓ కీలకమైన ముందడుగు పడింది” అని సెనేట్ మెజారిటీ నేత చుక్ షూమర్ అన్నారు.
ఇప్పటికిప్పుడు ఎందుకంటే!
స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ ఉంటుందని ఆ సంఘాలకు 2015లో అమెరికా సుప్రీం కోర్టు హామీ ఇచ్చింది. అయితే దశాబ్దాలుగా ఉన్న అబార్షన్ హక్కును ఆ కోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఇష్టానుసారం అబార్షన్‍లు చేయించుకునేందుకు వీల్లేదంటూ తీర్పు చెప్పింది. దీంతో స్వలింగ వివాహాలపై కూడా వ్యతిరేకంగా నిర్ణయం వస్తుందేమో అన్న ఆందోళనతో ఇప్పటికిప్పుడు సెనేట్‍లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
అలాగే, కాంగ్రెస్‍లో ఆధిపత్యం ఉన్న సమయంలోనే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్‍ను పాస్ చేయాలని డెమోక్రాట్లు అత్యవసరంగా దీన్ని తీసుకొచ్చారు.
ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రాట్లకు ఎదురుదెబ్బ తగిలింది. రిపబ్లికన్లు ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే కొత్త సభ్యులకు అధికారాలు వచ్చేందుకు జనవరి వరకు సమయం ఉంది. దీంతో అప్పుడు ప్రతిష్టంభణ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ బిల్లును ఆలోగా పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు.