US Presidential polls : 244 మిలియన్​ మంది ఓటర్లు- 7 స్వింగ్​ స్టేట్స్​.. అంకెల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు-us presidential polls 244 million voters 7 swing states what the numbers say ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Presidential Polls : 244 మిలియన్​ మంది ఓటర్లు- 7 స్వింగ్​ స్టేట్స్​.. అంకెల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు

US Presidential polls : 244 మిలియన్​ మంది ఓటర్లు- 7 స్వింగ్​ స్టేట్స్​.. అంకెల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు

Sharath Chitturi HT Telugu
Oct 04, 2024 09:25 AM IST

US Presidential elections : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అసలు అగ్రరాజ్యంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? కాంగ్రెస్​లోని ఎన్ని సీట్లకు ఎన్నికలు జరుగుతాయి? స్వింగ్​ స్టేట్స్​ ఏవి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు..
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు.. (AP)

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. నవంబర్​లో జరగనున్న ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది, అగ్ర రాజ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అంకెల్లో!

- ఇద్దరు -

అధ్యక్ష ఎన్నికల కోసం అనేక మంది పోటీ పడ్డారు. చివరికి ఎన్నికల బరిలో ఇద్దరు నిలబడ్డారు. వారి డెమోక్రాట్ కమలా హారిస్, రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్​.

-ఐదు-

నవంబర్ 5 - ఎలక్షన్​ డే.​ సాంప్రదాయకంగా నవంబర్ మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం జరుపుకుంటారు.

- ఏడు -

స్వింగ్ స్టేట్స్​ సంఖ్య - ఆయా రాష్ట్రాల్లో హోరాహోరీ పోటీ చూడవచ్చు. అవి.. అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్. అత్యంత రసవత్తరంగా సాగే ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనైనా కొద్ది ఓట్లు తేడాతో అభ్యర్థులు ఓడిపోవచ్చు.

- 34- 435 -

34 సెనేట్ స్థానాలు, ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఓటర్లు అధ్యక్షుడిని నిర్ణయించడమే కాదు, కాంగ్రెస్​ సభ్యులను కూడా ఎంపిక చేసుకుంటారు.

సభలో సభ్యులకు రెండేళ్ల పదవీకాలం ఉంటుంది. ప్రస్తుతం రిపబ్లికన్లకు మెజారిటీ ఉండగా, కమలా హారిస్ డెమోక్రాట్లు విజయంపై ఆశలు పెట్టుకున్నారు.

సెనేట్​లో ఆరేళ్ల కాలానికి 100 సీట్లకు గాను 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వల్ప డెమొక్రటిక్ మెజారిటీని తిప్పికొట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు.

- 538 -

ప్రతి రాష్ట్రంలో వేర్వేరు సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. సభకు ఎంపికయ్యే వారి సంఖ్య జనాభా ప్రకారం మారుతుంది. ఉదాహరణకు, గ్రామీణ వెర్మాంట్​లో కేవలం మూడు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాగా కాలిఫోర్నియాలో 54 ఉన్నాయి.

50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో మొత్తం 538 మంది ఓటర్లు ఉన్నారు. వైట్​బైస్​ని కైవసం చేసుకోవాలంటే అభ్యర్థికి 270 ఓట్లు రావాలి.

- 774,000 -

ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం. 2020 ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పోల్ వర్కర్ల సంఖ్య.

అమెరికాలో మూడు రకాల ఎన్నికల సిబ్బంది ఉన్నారు. ఓటర్లకు సహాయం చేయడం, ఓటింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం, ఓటరు ఐడిలు- రిజిస్ట్రేషన్లను ధృవీకరించడం వంటి పనులు చేయడానికి నియమించే పోల్ వర్కర్లు - వారిలో ఎక్కువ మంది ఉన్నారు.

ప్యూ ప్రకారం, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి మరింత ప్రత్యేక విధులను నిర్వహించడానికి ఎన్నికల అధికారులను నియమిస్తారు.

బ్యాలెట్ లెక్కింపును పర్యవేక్షించడానికి సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల పరిశీలకులను నియమిస్తాయి. 2020లో ఎన్నిక ఫలితాలను అంగీకరించడానికి అప్పటి అధ్యక్షుడు ట్రంప్​ నిరాకరించడంతో బ్యాలెట్​ లెక్కింపు ప్రక్రియపై ఈసారి మరింత ఫోకస్​ ఉండనుంది.

నవంబర్ 5 ఓటింగ్​కు ముందు తమకు వస్తున్న ఒత్తిడి, బెదిరింపుల గురించి పలువురు ఎన్నికల కార్యకర్తలు ఇప్పటికే ఏఎఫ్​పీతో మాట్లాడారు.

- 244 మిలియన్లు -

2024లో ఓటు వేయడానికి అర్హులైన అమెరికన్ల సంఖ్య అని ద్వైపాక్షిక పాలసీ సెంటర్ తెలిపింది. వీరిలో ఎంత మంది అసలు ఓటు వేస్తారో చూడాలి! అయితే 2018, 2022 మధ్యంతర ఎన్నికలు, 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలో దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది.

"ఓటింగ్ అర్హత కలిగిన జనాభాలో మూడింట రెండు వంతుల మంది (66%) 2020 అధ్యక్ష ఎన్నికలకు హాజరయ్యారు ఇది 1900 తరువాత ఏ జాతీయ ఎన్నికలో అయిన అత్యధిక రేటు," అని ప్యూ తన వెబ్సైట్లో పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం