UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
UPSC CDS 2 notification: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2 ఎగ్జామ్ నోటిఫికేషన్ ను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షకు అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in, upsconline.nic.in లను సందర్శించండి.
UPSC CDS 2 notification: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)-2 పరీక్ష నోటిఫికేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) బుధవారం విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 4 వరకు upsc.gov.in, upsconline.nic.in వెబ్ సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
459 పోస్ట్ ల భర్తీ
మొత్తం 459 పోస్ట్ ల భర్తీకి యూపీఎస్సీ ఈ సీడీఎస్ 2 పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో
- ఇండియన్ మిలిటరీ అకాడమీ 159 వ కోర్సు: 100 ఖాళీలు (ఎన్సీసీ 'సీ' ఆర్మీ వింగ్ సర్టిఫికేట్ హోల్డర్స్)
- ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు: 32 ఖాళీలు (ఎన్సీసీ 'సీ' నేవల్ వింగ్ సర్టిఫికేట్ హోల్డర్స్).
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ ప్రీ-ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సు: 32 ఖాళీలు (ఎన్సీసీ 'సీ' ఎయిర్ వింగ్ సర్టిఫికేట్ హోల్డర్లకు కేటాయించిన 3 తో సహా).
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 122వ ఎస్ఎస్సీ (మెన్) (ఎన్టీ) (యూపీఎస్సీ) కోర్సు: 276 ఖాళీలు.
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 36వ ఎస్ఎస్సీ ఉమెన్ (ఎన్టీ) (యూపీఎస్సీ) కోర్సు: 19 ఖాళీలు
యూపీఎస్సీ సీడీఎస్ 2 2024: విద్యార్హతలు
ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. నేవల్ అకాడమీకి ఇంజినీరింగ్ డిగ్రీ, ఎయిర్ ఫోర్స్ కు 10+2లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ తో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ అవసరం. పోస్టుల వారీగా వయోపరిమితి, ఇతర అర్హతల కోసం ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
యూపీఎస్సీ సీడీఎస్ 2 2024: దరఖాస్తు ఫీజు
యూపీఎస్సీ సీడీఎస్ 2 (UPSC CDS 2 Exam) పరీక్షకు దరఖాస్తు ఫీజు రూ.200 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. సీడీఎస్ 2 పరీక్షలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ అనే రెండు భాగాలుంటాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించిన సవివరమైన పథకాన్ని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. సీడీఎస్ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలకు అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ లో చూడవచ్చు.
యూపీఎస్సీ సీడీఎస్ 2 పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలి?
యూపీఎస్సీ సీడీఎస్ 2 పరీక్షకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్స్ upsconline.nic.in. లేదా upsc.gov.in ఓపెన్ చేయాలి.
- కొత్త అభ్యర్థి అయితే ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- ఇప్పుడు యూపీఎస్సీ సీడీఎస్ అప్లికేషన్ విండోలోకి లాగిన్ అవ్వాలి.
- ఫారంలో అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయండి.
- పరీక్ష ఫీజు చెల్లించి ఫామ్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం ఒక కాపీని సేవ్ చేయండి.