Electoral bond : 'ఎలక్టోరల్ బాండ్ నెంబర్లు ఏవి?' ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు..
Electoral bonds SBI: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీకోర్టు. బాండ్ నెంబర్లను వెల్లడించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు.. ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది.
Electoral bond numbers Supreme court : ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కష్టాలు కొనసాగుతున్నాయి! తాజాగా.. ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. బాండ్లకు సంబంధించిన డోనర్లు, డబ్బులను రిడీమ్ చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించినప్పటికీ.. బాండ్ నెంబర్లను ఎందుకు చెప్పలేదని? ప్రశ్నించింది. బాండ్ నెంబర్లు వెల్లడించకపోవడంతో.. తమ తీర్పును పూర్తిగా అమలు చేయలేదని ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. డోనర్లు, రాజకీయ పార్టీల మధ్య లింక్‌గా వ్యవహరించే ఎలక్టోరల్ బాండ్ నెంబర్ల వివరాలను పబ్లీష్ చేయాలని తేల్లిచెప్పింది.
'బాండ్ నెంబర్లు ఎందుకు బయటపెట్టలేదు?'
రాజకీయ పార్టీలకు ఫండింగ్‌గా ఉండే ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ.. గత నెలలో ఆ వ్యవస్థని రద్దు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. 2019 ఏప్రిల్ నుంచి అమ్మిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను.. మార్చ్ 8లోపు వెల్లడించాలని ఎస్బీఐకి ఆదేశాలిచ్చింది. అందుకు సమయం పడుతుందని, జూన్ 30 వరకు గడువు కావాలని కోరిన ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మార్చ్ 12 సాయంత్రం 5 గంటల లోపు పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి చెప్పాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను.. మార్చ్ 15లోపు.. ఈసీ తన వెబ్సైట్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది.
ఇదీ చూడండి:- Election Bonds: ఇచ్చినోళ్లు.. తీసుకున్నోళ్లు ఓకే... ఎవరు ఎవరికి ఇచ్చారో మాత్రం తెలీదు, ఎస్‌బిఐ చిత్రాలు..
Electoral bond numbers SBI : సుప్రీంకోర్టు చెప్పినట్టే.. మార్చ్ 12న.. డోనర్లు, రాజకీయ పార్టీల వివరాలను వేరువేరుగా.. ఈసీకి ఇచ్చింది ఎస్బీఐ. ఆ వివరాలను.. ఎన్నికల సంఘం, మార్చ్ 14న తన వెబ్సైట్లో ప్రచురించింది.
కానీ.. డోనర్లు, రాజకీయ పార్టీలకు లింక్‌గా ఉండే ఎలక్టోరల్ బాండ్ నెంబర్లను ఎస్బీఐ షేర్ చేయలేదు. ఈ విషయాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు.. ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
SBI Electoral bonds latest news : "స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఎవరు వచ్చారు? ఎలక్టోరల్ బాండ్ నెంబర్లను ఎస్బీఐ వెల్లడించలేదు. ఎందుకు? ఆ వివరాలను ఎస్బీఐ కచ్చితంగా బయటపెట్టాలి," అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. శుక్రవారం విచారణలో భాగంగా తేల్చిచెప్పింది.
ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సీజేఐ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.
'బాండ్ నెంబర్లతో ఏం తెలుస్తుంది?'
Electoral bond data : ఎన్నికల సంఘానికి ఎస్బీఐ ఇచ్చిన డేటాలో.. డోనర్ల పేర్లు- బాండ్స్‌ని రిడీమ్ చేసుకున్న పార్టీల పేర్లు వేరువేరుగా ఉన్నాయి. ఫలితంగా.. ఏ పార్టికి, ఎవరు- ఎంత ఇచ్చారు? అన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఇక.. ఎలక్టోరల్ బాండ్ నెంబర్లు బయటకి వస్తే.. డోనర్లు- రెసీపియంట్ మధ్య లింక్ ఏర్పడుతుందని తెలుస్తోంది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై ఎస్బీఐ ఎలా స్పందిస్తుందో, ఎలక్టోరల్ బాండ్ నెంబర్లను పబ్లీష్ చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం